హోలీ కేళి : సహజ రంగులు వాడండి

కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీది ప్రత్యేక స్థానం. హోలీ రోజు ఏ వీధి చూసినా… రంగులు చల్లుకుంటూ పిల్లలు, యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మార్కెట్లలో దొరికే రంగుల్లో ఉండే లెడ్, టైటానియమ్, బెంజిన్ తోపాటు సునేర్ లాంటి ప్రమాద కరమైన కెమికల్స్ హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు డాక్టర్స్. దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తుందని చెబుతున్నారు. చర్మ సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మోతాదు ఉండే కలర్స్ వాడడం వల్ల చర్మంపై పొక్కులు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. హోలీ ఐపోగానే… రంగులు పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్.

మార్కెట్ లో దొరికే ఎక్కువ శాతం కలర్స్ కెమికల్స్ కలిగి ఉన్నవే. కొన్ని కలర్స్ లోని కెమికల్స్ కళ్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. కళ్లలో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. కళ్ల జోళ్లు వాడడం మంచిదంటున్నారు. కళ్లల్లో రంగులు పడితే కళ్లను నలపకుండా నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

హోలీ రోజు వీలైనంత వరకు కెమికల్స్ కలిసిన రంగులకు దూరంగా ఉండటమే మంచిందంటున్నారు డాక్టర్స్.

Latest Updates