ప్రకృతి రిటర్న్​ గిఫ్ట్.. ఇట్లుంటది

పాలక్కడ్: కేరళలో కొన్నిరోజులుగా ఫుల్లు వానలు పడ్డయి. వరదలు ముంచెత్తినయి. అయితే, కొన్నిచోట్ల నీళ్లతోపాటు ప్లాస్టిక్ బాటిళ్లు కూడా వరదలా పారాయి! దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్​మీడియాలో ఇప్పుడు వైరల్​అయిపోయాయి.

ప్లాస్టిక్​ను విచ్చలవిడిగా వాడుకుంట, ఎక్కడపడితే అక్కడ పారేస్తూ పోతే ప్రకృతి ఇట్లనే వడ్డీ, ఫైన్​తో సహా రిటర్న్​గిఫ్ట్​ఇస్తదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భూమిని, సహజవనరులను దుర్వినియోగం చేస్తే ఇలాంటి రిటర్న్​గిఫ్ట్​లు తప్పవంటూ పోస్టులు పెడుతున్నారు. కేరళలోని పాలక్కడ్​లో వరదనీటితో పాటు కొట్టుకువచ్చిన ప్లాస్టిక్​బాటిళ్ల ఫొటోను ట్విట్టర్​లో ఉంచిన ఐఎఫ్ఎస్​అధికారి ప్రవీణ్​కుమార్​‘మనం ఇచ్చిన ప్లాస్టిక్​ను నీళ్లు తిరిగి మనకు గిఫ్ట్​గా తీసుకొచ్చాయి. ఇది హోం డెలివరీ’ అంటూ కామెంట్లు చేశారు.

అయితే, కేరళలో మాత్రమే కాదు.. ఇటీవల దేశంలోని అనేక చోట్ల కూడా నేచర్​మనకు ఇలాంటి రిటర్న్​గిఫ్ట్​లు ఇచ్చింది. కొన్ని రోజుల కిందట ముంబైలోని మెరైన్​డ్రైవ్​వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో సముద్రంలోకి మనం విసిరేసిన ప్లాస్టిక్​చెత్త అంతా రిటర్న్​గిఫ్ట్​గా వచ్చి రోడ్లను ముంచెత్తింది. ఈ సంఘటనలను ప్రస్తావిస్తూ కొంతమందేమో ప్లాస్టిక్ ను ఈజీగా, లాభదాయకంగా రీసైకిల్​చేయడం, ఎనర్జీ జనరేషన్​కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఈ విషయంలో గవర్నమెంట్​ప్లాస్టిక్​త్వరగా మట్టిలో కలిసిపోదని, దానిని నిర్మూలించలేమని కథలు చెప్పకుండా రీసైక్లింగ్​పై దృష్టి పెడితే మంచిదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరు మారకపోతే.. ఆఖరుకు ప్రకృతే మిమ్మల్ని మారుస్తుందంటూ చురకలేస్తున్నారు.

Latest Updates