ప్రకృతి పరిరక్షణ బాధ్యత అందరిదీ: మోహన్ భగవత్

న్యూఢిల్లీ: ప్రకృతిని పరిరక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌‌ఎస్‌ఎస్‌) చీఫ్​ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రకృతిని వాడటమే కాకుండా దాని అభివృద్ధి, పరిరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రకృతి దిన్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ హిందూ ఆధ్యాత్మిక సంస్థ సేవా ఫౌండేసన్ జరిపిన వర్చువల్ సంబరాల్లో భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము వినియోగించుకోవడం కోసమే ప్రకృతి ఉందని ప్రజలు భావిస్తున్నారని, దాని పరిరక్షణ కోసం వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని మండిపడ్డారు.

‘మనం గత 200 నుంచి 250 ఏళ్లుగా ఈ విధంగా జీవిస్తున్నాం. దాని పర్యవసాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మనుషులే కాదు ఈ ప్రపంచమూ మనుగడ సాగించలేదు. ప్రకృతి పరిరక్షణకు సంబంధించి మనుషులుగా మనం తీసుకోవాల్సిన బాధ్యతలను మన పూర్వీకులు ముందే గ్రహించారు. ప్రకృతి పరిరక్షణకు పాటుపడాల్సిన, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మనుషులగా మనందరిపైనా ఉంది. మన జీవన విధానంలో అందరినీ గౌరవిస్తాం. కానీ ఇతర ప్రపంచం, వారి లైఫ్‌ స్టయిల్‌తో దాన్ని మనం కోల్పోయాం. కానీ ఇవ్వాళ ప్రకృతిని గమనించడం ద్వారా ఆ విలువలను నెమ్మదిగా మనం తిరిగి పొందుతున్నాం’ అని భగవత్ పేర్కొన్నారు.

Latest Updates