రామునికి నవరత్నాల వస్త్రాలు.. కుట్టింది చిన్న టైలర్ షాపులోనే..

గ్రీన్‌‌‌‌, ఆరెంజ్‌‌‌‌ కలర్‌‌‌‌ డ్రెస్‌‌‌‌లు సిద్ధం చేసిన టైలర్లు
శంకర్‌‌‌‌లాల్‌‌‌‌, భగవత్‌‌‌‌లాలే దర్జీలు
40ఏండ్లుగా రెడీ చేస్తున్నది వీళ్లే

అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు5న భూమి పూజ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఆ టైమ్‌‌‌‌లో రాముడిని ప్రత్యేక వస్త్రాల్లో అలంకరించనున్నారు. మరి ఆ బట్టలను ఎవరు రెడీ చేశారో తెలుసా? అయోధ్యలోని బఢీ కుటియా ప్రాంతంలో చిన్న టైలరింగ్‌‌‌ ‌దుకాణం నడిపే ఇద్దరు అన్నదమ్ములు శంకర్‌‌‌‌లాల్‌‌‌‌, భగవత్‌‌‌‌లాల్‌‌‌‌. రామమందిర భూమి పూజ కార్యక్రమానికి రాముడికి నవరత్నాలు పొదిగిన గ్రీన్‌‌‌‌, ఆరెంజ్‌ ‌‌‌కలర్‌ ‌‌‌మఖ్‌మల్‌‌‌‌(వెల్వెట్‌‌‌‌) వస్త్రాలను వీళ్లు రెడీ చేశారు.

1985 నుంచి..
అయోధ్యలోని ఆలయాలకు ఏళ్లుగా ఈ కుటుంబమే వస్త్రాలు కుడుతోంది. ‘మా నాన్న బాబులాల్‌‌‌‌ 1985లో రాముడికి వస్త్రాలు కుట్టడం స్టార్ట్‌ ‌‌‌చేశారు. కుట్టుమెషీన్‌‌‌‌ను, మమ్మల్ని వెంటబెట్టుకొని రామ జన్మభూమికి వెళ్లి అక్కడే బట్టలు కుట్టేవారు. మేంముగ్గురం కూడా బట్టలు కుట్టేవాళ్లం. అప్పటి నుంచి ఈ పని కంటిన్యూ అవుతూవస్తోంది’ అని శంకర్‌‌‌‌లాల్‌‌‌‌చెప్పారు. రామమందిర కార్యక్రమానికి రాముడి కోసం రెండు రంగుల డ్రెస్‌‌‌‌లు రెడీ చేశామని తెలిపారు. ‘ప్రతి బుధవారం రాముడికి ఆకుపచ్చ రంగు డ్రెస్‌‌‌‌ వేస్తారు. కాబట్టి ఆ రంగు వస్త్రాలు సిద్ధం చేశాం. అలాగే ఆరెంజ్‌‌‌‌రంగు వస్త్రాలు కార్యక్రమం కోసం సిద్ధం చేశాం’ అని వివరించారు.

ఆదివారమే పూజారి వద్దకు వస్త్రాలు
రాముడితో పాటు లక్ష్మణ, భరత, శతృఘ్నులు, హనుమకు కూడా వెల్వెట్‌‌‌‌ బట్టతోనే వస్త్రాలు కుట్టామని శంకర్‌‌‌‌లాల్‌‌‌‌చెప్పారు. ఈ సారి 17 మీటర్ల క్లాత్ వాడామని తెలిపారు. ద్వారాల తెరలు, పానుపు వస్త్రాలు దీంతోనే రెడీ చేశామన్నారు. తాము రామునికి, ఇంకొంత మంది దేవుళ్లకే బట్టలు రెడీ చేస్తామని, మరెవరికీ, చివరకు తమ కోసం కూడా కుట్టుకోమన్నారు. అయోధ్య రాముడికి వస్త్రాలు కుట్టే భాగ్యం దక్కడం తమ అదృష్టమన్నారు. ఆదివారమే ఆ బట్టలు తమకు అందాయని రామ్‌‌‌‌ టెంపుల్‌ ‌‌‌ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌‌‌‌ చెప్పారు.

For More News..

జైలు ముందు పేలిన కారు బాంబు.. 29 మంది మృతి

మోడీ బాగా పనిచేస్తున్నరు.. సింగర్ లతా మంగేష్కర్ ట్వీట్

3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

Latest Updates