సరూర్‌ నగర్‌ చెరువులో నవీన్‌కుమార్‌ మృతదేహం లభ్యం

హైదరాబాద్‌: సరూర్ నగర్  చెరువులో గల్లంతైన నవీన్ మృతదేహం దొరికింది.  ఆదివారం రాత్రి నుంచి నవీన్ కోసం గాలిస్తున్నారు NDRF సిబ్బంది. రాత్రి వర్షంతో రెస్క్యూ ఆపారు. సోమవారం ఉదయం మళ్లీ రెస్క్యూ మొదలుపెట్టారు. ఉదయం మొత్తం బోట్లతో గాలించారు. అయితే చెరువులో ఒండ్రు మట్టి ఎక్కువగా ఉండటంతో.. పడవలు తిరిగే పరిస్థితి కనిపించలేదు. దీంతో బోట్స్ తో గాలించే పనిని ఆపేసింది NDRF టీం.

బోట్లతో గాలింపు ఆపి.. నేరుగా చెరువులోకి దిగి గాలించారు NDRF సిబ్బంది. దీంతో కొద్దిసేపటి క్రితం మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి తపోవన్ కాలనీలో జారిపడి సరూర్ నగర్ చెరువులోకి కొట్టుకుపోయాడు నవీన్. కొట్టుకుపోయిన 100 మీటర్ల దూరంలో నవీన్ కుమార్ డెడ్ బాడీ దొరికింది. 20 గంటలపాటు NDRF సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతదేహాన్ని వెలికి తీశారు.  వాన నీటిలో వాహనం మొరాయించి ఇబ్బందులు పడుతున్న వాహన దారుడికి సహాయం చేయడానికి వెళ్లి నవీన్‌ కుమార్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సరూర్‌ నగర్‌లో జరిగిన ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది.

Latest Updates