పుల్వామా ఉగ్రదాడి: పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన సిద్దు

పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చారు కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు. దాడిని ఖండిస్తూనే కొందరు చేసిన దానికి పాక్ మొత్తాన్ని నిందించడం సరికాదని చెప్పారు. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. సిద్దు ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని ప్రమాణస్వీకారానికి హజరై, పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకుని విమర్శల పాలయ్యారు.

పాక్ కు బుద్ది చెప్పాలి: పంజాబ్ సీఎం
పాక్ తో చర్చలు జరిపే సమయం అయిపోయిందని అన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. ఇక తగిన బుద్ది చెప్పక తప్పదని తెలిపారు. పాక్ డబుల్ గేమ్ ఆడుతుందని అన్నారు. ఒక వైపు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు ఉగ్రవాదులను భారత్ కు పంపుతుందని చెప్పారు.

Latest Updates