వివాదాస్పదంగా మారిన సిద్దూ ట్వీట్

కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఒక తప్పు ఓటు వేస్తే… మీ పిల్లలు చాయ్ వాలా, పకోడీవాలా, చౌకీదార్ అయ్యే ప్రమాదం ఉందని, అందుకే ఆలోచించి ఓటు వేయాలంటూ ట్వీట్ చేశారు. అయితే సిద్ధూ కామెంట్స్.. నీతి నిజాయితీగా కష్టించి పని చేసుకునే వారిని అవమానించినట్లే అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. చాయ్ వాలా, వాచ్ మెన్లు వారి వారి వృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవిస్తున్నారని, వారిని అవమానించడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

Latest Updates