యూఏఈలో మనవాళ్ల కోసం బయలుదేరిన షిప్పులు

  • కొచ్చికి తీసుకొస్తామన్న​అధికారులు

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా యునైటెడ్‌ అరబ్‌ నేషన్స్‌ (యూఏఈ), మాల్దీవుల్లో ఇరుక్కున్న మనవాళ్లను తిప్పి తీసుకొచ్చేందుకు నేవీ రంగంలోకి దిగింది. వారి కోసం సోమవారం అర్ధరాత్రి ముంబై కోస్ట్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ జలశ్వా, ఐఎన్‌ఎస్‌ మాగర్‌‌ మాల్దీవులకు బయలుదేరాయని డిఫెన్స్‌ అధికార ప్రతినిధి మంగళవారం ప్రకటించారు. ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌ దుబాయ్‌లోని వారిని తీసుకొచ్చేందుకు బయలుదేరిందన్నారు. మూడు షిప్పులు జనాన్ని కొచ్చికి చేరుస్తాయని చెప్పారు. ఐఎన్‌ఎస్‌ మగర్‌‌, ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌ సదరన్‌ నావల్‌ కమాండ్‌కు, ఐఎన్‌ఎస్‌ జలశ్వ ఈస్ట్‌ నావల్‌ కమాండ్‌కు చెందినవి. కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంట్లో భాగంగానే ఈ చర్యలు ముమ్మరం చేసింది.

Latest Updates