నావికాదళానికి చేరిన సబ్‌మెరైన్‌ ఖండేరీ

స్కార్పిన్‌ సబ్‌మెరైన్‌ ఖండేరీ నావికాదళానికి అందింది. ముంబైలోని మెజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌నుంచి ఖండేరీ నావికాదళానికి చేరింది. ఈ నెల 28వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సబ్‌మెరైన్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు.

స్కార్పీన్‌ శ్రేణికి చెందిన రెండో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ. సముద్రపు లోతుల్లో అత్యంత రహస్యంగా సంచరించగల స్టెల్త్‌ సామర్థ్యం దీని సొంతం. టార్పెడోలతో, ట్యూబ్‌ల ద్వారా యాంటీ షిప్‌ క్షిపణులతో సముద్ర అంతర్భాగం నుంచి.. ఉపరితలం నుంచి కూడా దాడులు చేయగల సత్తా ఈ జలాంతర్గామికి ఉంది. యాంటీ-సర్ఫేస్‌ వార్‌ఫేర్‌, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లలో పాల్గొనే సత్తా.. రహస్య సమాచార సేకరణ, నిఘా, బాంబులు అమర్చే సామర్థ్యం..అత్యాధునిక సబ్‌మెరైన్లకు ఉండాల్సిన అన్ని సామర్థ్యాలూ దీనికి ఉన్నాయి.

Latest Updates