మిగ్ తో రాఫెల్ ఫైట్ !

Navy’s MiG-29K to take on France’s Rafale-M off Goa

మిగ్ తో రాఫెల్​ ఫైట్ .. చదువుతున్నది నిజమే.అలా అని యుద్ధమూ జరగట్లేదు. వాటి మధ్య డాగ్ ఫైటూ లేదు. మరి, ఫైట్​ మాత్రం ఉంటుంది.ఏంటా ఫైట్​ అంటే.. రెండూ వాటి బలాబలాల ప్రదర్శన అన్నమాట. ఇండియా, ఫ్రాన్స్ లు కలిసి ఏటా‘వరుణ’ అనే నేవల్​ ఎక్సర్​సైజ్ ను చేస్తుం టాయి.ఇప్పటికే  గోవా తీరంలో మొదటి దశ ఎక్సర్​సైజ్ బుధవారం ప్రారంభమైంది. మే 10 దాకా ఆ ఎక్సర్​సైజ్ కొనసాగుతుం ది. ఆ ఎక్సర్​సైజ్ లోనే ఆ రెండు పోటాపోటీగా తలపడబోతున్నాయి. వాటి శక్తిసామర్థ్యాలను చూపించబోతున్నాయి. మిగ్ 29కే, రాఫెల్​ జెట్లు ఎక్సర్​సైజులో తమ విన్యాసాలతో ఆకట్టు కోనున్నాయి. మిగ్ 29కేలోని రాడార్లు, రాఫెల్​లోని ఏఈఎస్​ఏ రాడార్ల పని తీరును పరీక్షించనున్నారు.ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యపై నుంచి మిగ్ లు, ఫ్రాన్స్ ఎఫ్​ఎన్​ఎస్​ చార్లీ డి గాలీ యుద్ధ విమానం నుంచి రాఫెల్​ జెట్లు తమ తమ శక్తిని చూపించనున్నాయి.

రెండు దశల్లో డ్రిల్

17వ ఎడిషన్​ వరుణ ఎక్సర్​సైజును రెండు దశల్లో చేయనున్నారు. ఫ్రాన్స్ కు చెందిన రెండు డిస్ట్రాయర్లు ఎఫ్​ఎన్​ఎస్​ ఫోర్బిన్​, ఎఫ్​ఎన్​ఎస్​ ప్రోవిన్స్ లతో పాటు ఎఫ్​ఎన్​ఎస్​ లాటౌషి ట్రెవిల్​ అనే ఫ్రిగేట్​ , ఎఫ్​ఎన్​ఎస్​ మెర్నీ అనే ట్యాంకర్లు, ఓ అణ్వాయుధ జలాంతర్గామి పాల్గొననున్నాయి. ఇండియా నుంచి ఐఎన్​ఎస్​ ముంబై అనే డిస్ట్రాయర్​, తెగ్ క్లాస్​కు చెందిన ఐఎన్​ఎస్​ తర్కష్  ఫ్రిగేట్​, షిషుమర్​ క్లాస్​ జలాంతర్గామి ఐఎన్​ఎస్​ శంకుల్​, ఐఎన్​ఎస్​ దీపక్​ అనే ఫ్లీట్​ ట్యాంకర్​లు  డ్రిల్​లో భాగం అవుతున్నాయి. మొదటి దశలో భాగంగా ప్రదర్శనలు, ప్రొఫెషనల్​ ఇంటరాక్షన్స్ తోపాటు వివిధ ఆర్మీ పరికరాలపై చర్చలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్​ కూడా ఉంటుంది. రెండో దశలో మెరీటైం ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ రెండో దశ ఎక్సర్​సైజును డిజిబౌటిలో నెలాఖరున నిర్వహిస్తారు.

తొలిసారి ఫేస్ టు ఫేస్

మిగ్ 29, రాఫెల్​ యుద్ధ విమానాలు ఫేస్​ టు ఫేస్​ రావడం ఇదే తొలిసారి . దీంతో ఇటు ఇండియా, అటు ఫ్రాన్స్ లు చాలా క్లోజ్ గా పరిశీలించనున్నాయి. రాత్రింబవళ్లు సాగే ఎక్సర్​సైజుల్లో వాటి డిఫెన్స్ , అటాకింగ్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. 36 యుద్ధ విమానాల కొనుగోలుపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్​)తో రాఫెల్​ కంపెనీ దసో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిం దే. ఈ ఎక్సర్​సైజ్ తో నేవీ మోడల్​ రాఫెల్​పై నేవీతో ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా కాంట్రాక్ట్​ను దక్కించుకోవాలని చూస్తోంది. ఇంజన్​, సర్వీసిం గ్ సమస్యలతో మిగ్ 29కేలపై  నేవీ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.దీంతో వేరే యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఆ రేసులో రాఫెల్​, బోయిం గ్ ఎఫ్​/ఏ18 సూపర్​ హార్నెట్​లు ముందు వరుసలో ఉన్నాయి.

Latest Updates