యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కుటుంబంతో సహా క్వారంటైన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీని, అతని కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్ చేశారు. యూపీ ముజఫర్ నగర్ జిల్లా బుధానాలోని తన ఇంట్లో 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలని సూచించారు. నవాజుద్దీన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే, ట్రావెల్ పాస్ తీసుకుని నవాజుద్దీన్.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ నెల 15న బుధానాలోని తన సొంతింటికి చేరుకున్నాడు. దీంతో అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి మే 25 వరకు ఇంట్లోంచి బయటికి రాకూడదని సూచించారు. తల్లి, సోదరుడు, బావతో కలిసి చేసిన ప్రయాణంలో 25 పాయింట్ల వద్ద మెడికల్ స్క్రీనింగ్ చేయించుకున్నానని నవాజుద్దీన్ మీడియాతో చెప్పారు. హెల్త్ ఆఫీసర్లు నవాజుద్దీన్ ఇంటికి వెళ్లి 14 రోజుల హోం క్వారంటైన్ ఆదేశించారని బుధానా పోలీసు సర్కిల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కుశాల్‌పాల్ సింగ్ తెలిపారు.

Latest Updates