చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌‌

  • నక్సలైట్‌ హతం

రాయ్‌పూర్‌‌: చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పురాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ చనిపోయాడు. దంతేవాడ జిల్లాలోని హుర్రేపాల్‌, బిచాపల్‌ కొండ ఫారెస్ట్‌ రేంజ్‌ మధ్య టాస్క్‌ ఫోర్స్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించారని, ఆ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అభిషేక్‌ పల్లవా చెప్పారు. చనిపోయిన వ్యక్తిని మావోయిస్టు మిలటరీ ప్లటూన్‌ నెం.2 మెంబర్‌‌ దస్రూ పునెంగా గుర్తించామని అన్నారు. అతనిపై రూ.8లక్షల రివార్డు ఉందని అన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

Latest Updates