మాటల్లో కాదు.. చేతల్లో చూపండి: పాక్ కు భారత్ స్ట్రాంగ్ మెసేజ్

Naya Pakistan should show naya action against terror groups, says government

ఉగ్రవాదంపై చర్యలను మాటల్లో కాదు.. చేతల్లో చూపాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ మెసేజ్ పంపింది భారత్. ఉగ్ర సంస్థలపై చర్యలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడం వేస్ట్ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. నమ్మదగిన రీతిలో, స్పష్టమైన ఆధారాలు ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికీ పాక్ భూభాగంపై నుంచి సాగుతున్న ఉగ్రవాద గ్రూప్ లను ఆ దేశం ప్రోత్సాహిస్తోందని, వాటిని నియంత్రించడంలో ఫెయిల్ అవుతోందని అన్నారు.

నయా పాక్ అయితే నయా యాక్షన్ ఏది?

కొత్త ఆశలతో సాగుతున్న నయా పాక్ అని ఆ దేశ నాయకత్వం చెప్పుకుంటోందని, అది నిజమైతే టెర్రరిజంపై ‘నయా యాక్షన్’ తీసుకుని చూపించాలని చెప్పారు. ఢిల్లీలో శనివారం ఉదయం రవీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను పాక్ రక్షిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి తమ పనేనని జైషే వీడియో రిలీజ్ చేసినా.. పాక్ నాయకత్వం ఆ దాడి జైషై చేయలేదనడం దురదృష్టకరం అన్నారు. జైషే ఆ ప్రకటన చేయలేదని, ఇందులో కొంత కన్ఫ్యూజన్ ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చెబుతున్నారని, అంటే జైషేను పాక్ రక్షిస్తోందనేనా అని ప్రశ్నించారు.

ఎయిర్ స్ట్రైక్ లక్ష్యం నెరవేరింది

పాకిస్థాన్ లోని జైషే క్యాంపులపై ఐఏఎఫ్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లక్ష్యం నెరవేరిందని రవీశ్ కుమార్ చెప్పారు. ఫిబ్రవరి 27 పాక్ యుద్ధ విమానాలను తిప్పికొట్టడంలో వింగ్ కమాండర్ అభినందన్ నడిపిన మిగ్-21 బైసన్ ఒక్కటే కూలిపోయిందని తెలిపారు. పాక్ మాత్రం రెండు భారత జెట్స్ కూల్చామని చెబుతోందని, దాని వీడియో ప్రూఫ్ కూడా ఉందంటోందని, మరి దాన్ని బయట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అయితే అభినందన్ పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16ను కూల్చారని, దాని అమ్రామ్ మిస్సైల్ భాగం భారత బలగాలకు దొరికిందని చెప్పారు.

పాకిస్థాన్ లో జైషే ట్రైనింగ్ క్యాంపులు, దాని చీఫ్ మసూద్ అజార్ నివాసం వంటి విషయాలపై ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలన్నింటికీ తెలుసని రవీశ్ చెప్పారు. మసూద్ ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని ఆయా దేశాలను కోరామన్నారు.

పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలకు ఓకే అని కాదు

సిక్కులకు పవిత్ర క్షేత్రమైన కర్తార్ పూర్ పై పాక్ తో చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రవీశ్ స్పష్టం చేశారు. అయితే కర్తార్ పూర్ కారిడార్ పై భేటీకి ఓకే చెప్పామని, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించామని అర్థం కాదని చెప్పారు. భారత సిక్కు సమాజం భావోద్వేగం, సెంటిమెంట్స్ కు సంబంధించిన విషయమని తెలిపారు.

Latest Updates