నయనతార మిస్టర్ లోకల్ టీజర్ రిలీజ్

హీరోయిన్ నయతార లీడ్ రోల్ నటించిన సినిమా మిస్టర్ లోకల్. ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీ టీజ‌ర్‌ రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ‌కార్తికేయ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇవాళ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో శివ కార్తికేయ‌న్ మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార ..కేవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సీఈవో కీర్తన వాసుదేవన్‌ గా న‌టించింది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కాస్త ఫ‌న్నీగా ఉండ‌గా, అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

నా పేరు మనోహర్‌. నన్ను అందరూ మిస్టర్‌ లోకల్‌ అని పిలుస్తుంటారు’ అంటూ కార్తికేయన్‌ ఫైటింగ్‌ చేస్తూ చెబుతున్న డైలాగులతో టీజర్‌ మొదలైంది.

తొలిచూపులోనే కీర్తన వాసుదేవన్‌ (నయనతార)ను చూసి ఇష్టపడతాడు. ఆమె వెంటపడుతుంటాడు. ‘నేనెవరో తెలుసా. కేవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో కీర్తన వాసుదేవన్‌. నాకు నీలాంటి లోకల్‌ అబ్బాయిలు అస్సలు నచ్చరు’ అంటూ కార్తికేయన్‌ను నయన్‌ కసురుకోవడం ఫన్నీగా ఉంది. మే 1న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ లో జంటగా నటించారు.

Latest Updates