డ్రగ్స్‌ కేసు: హీరోయిన్ దీపికను ప్రశ్నిస్తోన్న ఎన్‌సీబీ అధికారులు

సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతోన్న ఆరోపణల కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొణే  ఇవాళ(శనివారం) నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(NCB) విచారణ జరుపుతోన్న ముంబై, కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు తన భర్తతో కలిసి వచ్చింది.

దీపిక నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది.

దీపిక, శ్రద్ధా, రకుల్‌తో పాటు ఈ కేసులో సారా అలీఖాన్‌, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో వారు  ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.

Latest Updates