బాలీవుడ్ కమెడియన్ భారతీసింగ్ ఇంటిపై నార్కొటిక్స్ అధికారుల దాడులు

 ముంబై: బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధాకారులు దాడులు చేపట్టారు. హిందీ ఛానెల్స్ చూసే వారికి ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ షోలు చూసే వారికి భారతీసింగ్ చిరపరిచితురాలు. భారతీసింగ్ తోపాటు… ఆమె భర్తకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందనే ఆరోపణలు రావడంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అధికారులు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు.. ఆఫీసులలో సోదాలు జరిపింది. నటుడు అర్జున్ రామ్ పాల్.. నిర్మాత ఫిరోజ్ నదియాద్ వాలా ఇళ్లు.. ఆఫీసులలో కూడా కొద్ది రోజుల క్రితం దాడులు చేసింది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి గత సెప్టెంబర్ 9న అరెస్టయి దాదాపు నెల రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇదే కోవలో భారతీసింగ్.. ఆమె భర్త  కూడా డ్రగ్స్ ఉపయోగిస్తున్నారన్న సమాచారం రావడంతో ఇవాళ ఆకస్మిక దాడులు చేపట్టి సోదాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates