ఫ్లిప్‌‌కార్ట్‌ పై దివాలా పిటిషన్‌

ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఇబ్బందుల్లో పడింది. రూ.26.95 కోట్ల పేమెంట్‌‌ డిఫాల్ట్ అయినందుకు ఈ ఆన్‌‌లైన్ షాపింగ్‌‌ కంపెనీపై దివాలా పిటిషన్‌‌ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌‌సీఎల్‌‌టీ) బెంగళూరు బెంచ్‌‌ స్వీకరించింది. ఇన్‌‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌‌ కిందకు కూడా తీసుకొచ్చింది. అయితే ఎన్‌‌సీఎల్‌‌టీ ఇచ్చిన ఆర్డర్లపై కర్నాటక హైకోర్ట్ స్టే ఇచ్చినట్టు కంపెనీ చెబుతోంది. ఫ్లిప్‌‌కార్ట్‌‌కు అనుకూలంగా ఎన్‌‌సీఎల్‌‌టీ ఇచ్చిన ఆర్డర్‌‌పై కర్నాటక హైకోర్ట్ స్టే ఇచ్చిందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇది కమర్షియల్ లిటిగేషన్‌‌ను, దీనిపై మరింత కామెంట్ చేయనని అన్నారు. ముంబైకి చెందిన క్లౌడ్‌‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్‌‌కు  రూ.26.95 కోట్ల పేమెంట్ డిఫాల్ట్ అవడంతో, ఫ్లిప్‌‌కార్ట్‌‌కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేసింది. కార్పొరేట్ ఇన్‌‌సాల్వెన్సీ రిజొల్యూషన్ ప్రాసెస్‌‌ కింద ఎన్‌‌సీఎల్‌‌టీ బెంగళూరు బెంచ్‌‌ ఈ పిటిషన్‌‌ను అంగీకరించినట్టు తెలిసింది. క్లౌడ్‌‌వాకర్‌‌‌‌ తన ఎల్‌‌ఈడీ టీవీలను ఫ్లిప్‌‌కార్ట్ ప్లాట్‌‌ఫామ్‌‌పై రిటైల్ చేస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం టీవీలను ఇంపోర్ట్ చేసినందుకు చేయాల్సిన పేమెంట్లను ఫ్లిప్‌‌కార్ట్ డిఫాల్ట్ అయింది. దీంతో ఈ ఏడాది జూలైలో క్లౌడ్‌‌వాకర్‌‌‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ను ఎన్‌‌సీఎల్‌‌టీలోకి లాగింది. కంపెనీ ఇప్పటికే రూ.85.57 కోట్లకు పైగా చెల్లించిందని, పిటిషనర్‌‌‌‌కు మరింత చెల్లించాల్సినవసరం లేదని పేర్కొంది. ఈ నెల 25 వరకు ఈ విషయంపై రిపోర్ట్ చేయాలని ఇన్‌‌సాల్వెన్సీ
రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌‌ను కూడా ఎన్‌‌సీఎల్‌‌టీ ఆదేశించింది.

త్వరలో నోకియా టీవీలు..ఫ్లిప్‌‌కార్ట్‌‌తో పార్ట్‌‌నర్‌‌ షిప్‌‌

నోకియా స్మార్ట్‌‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌‌ టీవీలు కూడా ఇక ఇండియన్ కస్టమర్లను అలరించనున్నాయి. ఇండియా మార్కెట్‌‌లోకి స్మార్ట్‌‌ టీవీలను లాంచ్ చేసేందుకు నోకియా, ఫ్లిప్‌‌కార్ట్‌‌తో జతకట్టింది. దీంతో నోకియా కన్జూమర్ డ్యూరెబుల్స్ స్పేస్‌‌లోకి అడుగుపెడుతోంది. ‘ఇండియాలో స్మార్ట్‌‌ టీవీలకు నోకియా బ్రాండ్ ను వాడుకునేందుకు నోకియాతో ఫ్లిప్‌‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్‌‌గా స్మార్ట్ టీవీ కేటగిరీలోకి నోకియా బ్రాండ్‌‌ వస్తోన్న తొలి దేశం ఇదే’ అని కంపెనీలు తెలిపాయి. నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌‌ టీవీలను అభివృద్ధి చేసేందుకు, తయారు చేసేందుకు, డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఇండియన్‌‌ కస్టమర్ల అవసరాలను ఫ్లిప్‌‌కార్ట్ అర్థం చేసుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఎండ్ టూ ఎండ్ మార్కెట్ స్ట్రాటజీలోకి తాము వెళ్తామని చెప్పింది. ప్రొడక్ట్ స్పెసి ఫికేషన్లు, ధర, లాంచ్ డేట్‌‌ వంటి సమాచారంపై ఎలాంటి క్లారిటీని కంపెనీలు ఇవ్వలేదు.

జేబీఎల్‌‌ సౌండ్‌‌తో..

చాలా స్మార్ట్‌‌ ఫోన్ కంపెనీలు, తమ ప్రొడక్ట్ పోర్ట్‌‌ఫోలియోలో స్మార్ట్‌‌ టీవీలను యాడ్ చేస్తున్నాయి. వీటిలో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, షియోమి, మోటోరోలా, వన్‌‌ప్లస్‌‌లున్నాయి. సెప్టెంబర్‌‌‌‌లో మోటోరోలా కూడా ఇండియాలో స్మార్ట్‌‌టీవీలను లాంచ్ పండగ సీజన్​ లాంచ్​ చేస్తోంది. వీటిని ప్రత్యేకంగా ఫ్లిప్​కార్ట్​లోనే అమ్ముతోంది.  దీని టెలివిజన్ సెట్స్ 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు ఉన్నాయి.  ధరలు రూ.13,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌‌ టీవీల్లో జేబీఎల్ సౌండ్  ఉంటుందని తెలుస్తోంది. ‘నోకియా గ్లోబల్‌‌గా పాపులర్‌‌‌‌ అయిన టెక్నాలజీ బ్రాండ్. వారితో కలిసి పయనించడం చాలా ఆనందంగా ఉంది’ అని ఫ్లిప్‌‌కార్ట్ సీనియర్  ఆఫీసర్​  ఆదర్శ్ మీనన్ ఈ సందర్భంగా అన్నారు.

Latest Updates