‘బీజేపీతో కలిశాకే శివసేన తప్పుడు దోవలోకెళ్లింది’

  • అది మత రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు
  • ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే తమ ముఖ్యమంత్రిగా ఉంటారని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి ప్రభుత్వం పూర్తికాలం నడుస్తుందని చెప్పారు. బీజేపీ చాలా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ అంతం నేటితో మొదలైందని అన్నారాయన. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత నవాబ్ మీడియాతో మట్లాడారు.

శివసేన మత రాజకీయాలు చేయడానికి పుట్టిన పార్టీ కాదని అన్నారు నవాబ్ మాలిక్. ఆ పార్టీ మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం పుట్టిందని చెప్పారాయన. కానీ, బీజేపీతో చేతులు కలిపిన తర్వాతే శివసేన తప్పుడు దోవలోకి వెళ్లిందని అన్నారు.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర అపర చాణక్యుడని చెప్పారు నవాబ్ మాలిక్. చాణక్యులమని చెప్పుకొనే వాళ్లను ఆయన ఓడించారంటూ అమిత్ షాపై సెటైర్లు వేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా మహారాష్ట్ర విజయమని అన్నారాయన.

MORE NEWS: 

చంద్రయాన్ ఫెయిల్ అయినా.. ఈ సూర్యుడి విజయంపై ధీమా

ఎముకల్లో బలం పెరగాలంటే ఇవి తినాల్సిందే

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

Latest Updates