రైతులకు అండగా నిలవాలి.. మోడీకి పవార్ విజ్ఞప్తి

పంట నష్టంతో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని ప్రధాని మోడీని కోరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ప్రధానితో  శరద్ పవార్ సుమారు 30 నిముషాల పాటు భేటీ అయ్యారు. ప్రధానికి రైతు సమస్యలపై మూడు పేజీల లేఖ అందజేశారు శరద్ పవార్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. నాసిక్, నాగపూర్ జిల్లాలలో స్వయంగా పంట నష్టాలను పరిశీలించినట్లు మోడీకి చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

Latest Updates