కివీస్‌తో ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో భారత బ్యాట్స్‌‌మన్‌ చిత్తు

హామిల్టన్‌‌: తొలి టెస్ట్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌పై ఓ అంచనాకు రావాలనుకున్న కెప్టెన్‌‌ కోహ్లీ ప్లాన్‌‌ వర్కౌట్‌‌ కాలేదు. శుక్రవారం మొదలైన మూడు రోజుల ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో కివీస్‌‌ ఎలెవన్‌‌ బౌలర్ల ముందు ఇండియా బ్యాట్స్‌‌మన్‌‌ పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. కేవలం విహారి, పుజారా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 78.5 ఓవర్లలో 263 రన్స్‌‌కు ఆలౌటైంది. వామప్‌‌ గేమ్‌‌కు దూరంగా ఉన్న విరాట్‌‌.. నెట్‌‌ సెషన్‌‌లో ఎక్కువసేపు బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు.

ముగ్గురూ ఫెయిల్‌‌

ఈ మ్యాచ్‌‌ ద్వారా ఇద్దరు ఓపెనర్లను సెలెక్ట్‌‌ చేసుకోవాలని మేనేజ్‌‌మెంట్‌‌ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. గ్రాస్‌‌ కవరింగ్‌‌ వికెట్‌‌ మీద కివీస్‌‌ సీమ్‌‌ బౌలర్లు వేసిన బౌన్సర్ల పరీక్షలో ముగ్గురు ఓపెనర్లు పృథ్వీ షా (0), మయాంక్‌‌ (1), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (0) ఘోరంగా తేలిపోయారు. కుగెలిన్‌‌ (3/40) అద్భుతమైన సీమ్‌‌, ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో దూసుకొచ్చిన ఇన్నింగ్స్‌‌ నాలుగో బంతిని కళ్లు మూసుకుని అడ్డంగా ఆడిన పృథ్వీ.. షార్ట్‌‌ లెగ్‌‌లో రచిన్​ రవీంద్ర చేతికి చిక్కాడు. ఏడో ఓవర్‌‌లో కుగెలిన్‌‌ డబుల్‌‌ మ్యాజిక్‌‌ చేశాడు. వరుస బంతుల్లో మయాంక్‌‌, గిల్‌‌ను వెనక్కి పంపాడు. దీంతో 5 రన్స్‌‌కే 3 వికెట్లు కోల్పోయి ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా ఓ ఎండ్‌‌లో స్థిరంగా ఆడితే.. రహానె (18) కొద్దిసేపు ఆడి వెనుదిరిగాడు. 38/4 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన విహారి.. యాంకర్‌‌ ఇన్నింగ్స్‌‌తో అదరగొట్టాడు. కివీస్‌‌ స్పిన్‌‌, పేస్‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ పరుగుల వరద పారించాడు. లాంగాఫ్‌‌, లాంగాన్‌‌, మిడాఫ్‌‌లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. రెండో ఎండ్‌‌లో పుజారా కూడా ఓ టవరింగ్‌‌ సిక్సర్‌‌తో ఆకట్టుకున్నాడు. సెకండ్‌‌, థర్డ్‌‌ సెషన్‌‌లో బ్యాటింగ్‌‌ చేయడం సులువుగా మారడంతో ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌కు 195 రన్స్​ పార్ట్​నర్​షిప్​ అందించారు. ఈ క్రమంలో విహారి సెంచరీ చేసి రిటైర్డ్‌‌హర్ట్‌‌ అయ్యాడు. ఫైనల్‌‌ సెషన్‌‌లో పుజారా ఔట్‌‌కావడంతో ఇన్నింగ్స్‌‌ తడబడింది. సోధీ (3/72) టర్నింగ్‌‌కు… పంత్‌‌ (7), సాహా (0), అశ్విన్‌‌ (0), ఉమేశ్‌‌ (9 నాటౌట్‌‌), జడేజా (8) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితం కావడంతో ఇండియా ఓ మాదిరి స్కోరుకు పరిమితమైంది. గిబ్సన్‌‌ రెండు, నీషమ్‌‌ ఒక వికెట్‌‌ తీశారు.

స్కోరు బోర్డు

ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌: పృథ్వీ (సి) రచిన్ (బి) కుగెలిన్‌‌ 0, మయాంక్‌‌ (సి) క్లీవెర్‌‌ (బి) కుగెలిన్‌‌ 1, పుజారా (సి) క్లీవెర్‌‌ (బి) గిబ్సన్‌‌ 93, గిల్‌‌ (సి) సీపర్ట్‌‌ (బి) కుగెలిన్‌‌ 0, రహానె (సి) బ్రూస్‌‌ (బి) నీషమ్‌‌ 18, విహారి (రిటైర్డ్‌‌హర్ట్‌‌) 101, పంత్‌‌ (సి) కుగెలిన్‌‌ (బి) సోధీ 7, సాహా (సి) క్లీవెర్‌‌ (బి) గిబ్సన్‌‌ 0, అశ్విన్‌‌ (ఎల్బీ) సోధీ 0, ఉమేశ్‌‌ (నాటౌట్‌‌) 9, జడేజా (సి) అలెన్‌‌ (బి) సోధీ 8, ఎక్స్‌‌ట్రాలు: 26, మొత్తం: 78.5 ఓవర్లలో 263 ఆలౌట్‌‌.

వికెట్ల పతనం: 1–0, 2–5, 3–5, 4–38, 5233, 6–245, 7–246, 8–246, 9–250, 10–263.

బౌలింగ్‌‌: కుగెలిన్‌‌ 14–2–40–3, టిక్నర్‌‌ 15–3–37–0, మిచెల్‌‌ 7–1–15–0, నీషమ్‌‌ 13–3–29–1, గిబ్సన్‌‌ 10–1–26–2, సోధీ 14.5–0–72–3, రచిన్​ 5–1–30–0.

ఓపెనింగ్​కు రెడీ

మేనేజ్‌‌మెంట్‌‌ అడిగితే ఓపెనింగ్‌‌ చేయడానికి సిద్ధం. ఓ ప్లేయర్‌‌గా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌ చేసేందుకు రెడీగా ఉన్నా. కానీ ఇప్పటివరకు నాకు ఎలాంటి సమాచారం లేదు. కొన్నిసార్లు టీమ్‌‌ కాంబినేషన్‌‌ను అర్థం చేసుకోవాలి. చాన్స్‌‌ రాకపోతే నిరాశ చెందొద్దు. స్వదేశంలో ఐదుగురు బౌలర్లతో ఆడతారు కాబట్టి ఓ బ్యాట్స్‌‌మన్‌‌ మిస్‌‌ అవుతాడు. అప్పుడు నాకు తుది జట్టులో ప్లేస్‌‌ ఉండదు. ఇప్పటికైతే నేను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. జస్ట్‌‌ ప్రాసెస్‌‌ను ఫాలో కావడమే. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ ఉంటుందని భావించా. ఎందుకంటే ఇండియా-ఎ తరఫున నేను ఇక్కడ రెండు మ్యాచ్‌‌లు ఆడా. పుజారాతో సమన్వయం కుదిరాక మా స్టయిల్లో బ్యాటింగ్‌‌ చేశాం. – విహారి

Latest Updates