NDRF కూడా కాపాడలేకపోతోంది.. బొగ్గు గని ప్రమాదంపై సీఎం సంగ్మా

మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకున్న 13 మంది కార్మికులను రక్షించడానికి విశ్వప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక కార్యక్రమాలపై స్పందించిన మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా… ఇది చాలా కష్టమైన, సంక్లిష్టమైన ఆపరేషన్ అని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు శాయశక్తులా కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కార్మికులను కాపాడేందుకు రెస్క్యూటీమ్ ఎంతో కష్టపడుతోందని చెప్పారు. ఐతే.. కార్మికులను కాపాడటం అంత సులభంగా అయ్యే పనిలా కనిపించడం లేదన్నారు.

మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లా… సైపుంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. ర్యాట్ హాల్ బొగ్గు గనిలో డిసెంబర్ 14 శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. 13 మంది బొగ్గు గని కార్మికులు… 320 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. ఈ బొగ్గు గనిలోకి.. పక్కనే ఉన్న లైటెయిన్ నదిలోని వరద నీరు రావడంతో… కార్మికులు టన్నెల్ లోనే చిక్కుకుపోయారు. వీరిని బయటకు తీయడానికి … ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, స్కూబా డైవర్లు నాలుగురోజులుగా కష్టపడుతున్నారు. పదుల సంఖ్యలో ఎమర్జెన్సీ బృందాలు స్పాట్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బొగ్గు గని లోపల 70 అడుగుల లోతు వరకు వరద నీరు ఉందని చెబుతున్నారు. మోటార్లతో నీటికి బయటకు తోడుతున్నారు. కార్మికులు బొగ్గు గనిలోనే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates