వైఎస్ షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు : వ్య‌క్తి అరెస్ట్‌

One arrested for abusive comments against Sharmila

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి సోద‌రి షర్మిలపై సోష‌ల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన హరీష్ చౌదరి అనే వ్య‌క్తిని రాయ‌దుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన కంప్లయింట్ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు జరిపారు. సోషల్ మీడియానుంచి ఆ పోస్టులు డిలీట్ చేయించారు.

పార్టీ ప్రచారంలో భాగంగా సోమవారం అమరావతిలో విలేకరుల సమావేశంలో షర్మిల.. తెదేపా అధినేత‌ చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు. ఆ స‌మావేశాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా యూట్యూబ్‌లో చూసిన హ‌రిబాబు ఆ స‌మ‌యంలో మూడుసార్లు అసభ్య పదజాలం వాడుతూ కొన్ని కామెంట్లు  పోస్ట్‌ చేశాడు.

గౌరవానికి భంగం కలిగించాడంటూ అందిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఐపీ అడ్రెస్ ఆధారంగా అత‌డిని .. చౌటుప్పల్‌లో అరెస్టు చేశారు. నిందితుడు ఫార్మా సంస్థలో ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.

Latest Updates