క‌రోనా క్రైసిస్ : తీవ్ర ఒత్తిడిలో 47శాతం మంది మ‌హిళా ఉద్యోగులు

మ‌న‌దేశంలో క‌రోనా కార‌ణంగా సుమారు 47శాతం మంది మ‌హిళా ఉద్యోగులు ( వ‌ర్కింగ్ మద‌‌ర్స్ ) తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. లింక్డ్ ఇన్ వ‌ర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఓ స‌ర్వే నిర్వ‌హించింది.

జూలై 27 నుండి ఆగస్టు 23 వరకు 2,254 మందితో నిర్వ హించిన స‌ర్వేలో క‌రోనా మ‌హిళా ఉద్యోగులు, వ్యాపార వేత్త‌ల‌పై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తున్న‌ట్లు తేలింది. సర్వేలో పనిచేసే 17 శాతం పురుషుల‌తో పోలిస్తే, 31 శాతం వ‌ర్కింగ్ ఉమెన్స్ ప్రస్తుతం పిల్లల సంరక్షణపై పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

44 శాతం మంది తల్లులు పిల్లల సంరక్షణ కోసం త‌క్కువ గంట‌లు ప‌నిచేస్తున్నారు. దాదాపు వారికంటే రెండు రెట్లు ఎక్కువగా పురుషులు ప‌నిచేస్తున్నార‌ని, మ‌హిళా ఉద్యోగులు పిల్లల సంరక్షణ, విధులు నిర్వ‌హించ‌డం వ‌ల్ల తీవ్రంగా ఒత్త‌డికి గుర‌వుతున్న‌ట్లు తేలింది. అయితే పురుషులు వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మ‌ద్ద‌తుతో ప‌నిచేస్తున్నార‌ని, 20 శాతం పని చేసే తల్లులు తమ పిల్లలను చూసుకోవటానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితుతుల‌పై ఆధారపడతారని సర్వే తెలిపింది.

46 శాతం మంది వ‌ర్కింగ్ ఉమెన్స్ విధులు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం లేదని, తీవ్ర ఒత్తిడితో దృష్టిసారించ‌లేక‌పోత‌న్న‌ట్లు లింక్డ్ ఇన్ స‌ర్వేలో పాల్గొన్నవారు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. 42 శాతం మంది తమ పిల్లలతో ఇంట్లో పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారని కనుగొన్నది.

Latest Updates