యూత్‌‌‌‌ వ్యవసాయం చేయాలె: గవర్నర్ తమిళిసై

  • గవర్నర్ల సదస్సులో రాష్ట్ర రైతుల సమస్యలను ప్రస్తావిస్తా
  • అగ్రికల్చర్ వర్సిటీలో రెండు రోజుల సదస్సు ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు:

యువతను వ్యవసాయం వైపు ఆకర్షించవలసిన అవసరం చాలా ఉందని రాష్ట్ర గవర్నర్ ​డాక్టర్ ​తమిళిసై సౌందర రాజన్​ అన్నారు. ఆ దిశగా ఫ్రొఫెసర్ ​జయశంకర్​ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.  సోమవారం అగ్రికల్చర్ యూనివర్సిటీలో  రెండు రోజుల ”యూత్​ యాజ్​టార్చ్ బేరర్స్​ ఆఫ్ ​బిజినెస్ ఓరియెంటెడ్ ​అగ్రికల్చర్​ ఇన్​ సౌత్​ ఇండియా” ప్రాంతీయ సదస్సును గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి కోసంసైంటిస్టులు పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరగనున్న గవర్నర్ల సదస్సులో తెలంగాణ రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని తెలిపారు.

మంత్రి మామిడి తోటను చూసొస్తా

వ్యవసాయ  మంత్రి నిరంజన్​రెడ్డి స్వయానా రైతు అయినందున వ్యవసాయ రంగం అభివృద్ధికి ఆయన మరింత బాగా పనిచేసే అవకాశం ఉందన్నారు. త్వరలోనే జోగులాంబ ఆలయాన్ని సందర్శిస్తానని, మంత్రి మామిడి తోటనూ చూసొస్తానని చెప్పారు.

యువతకు ఎవుసంలో శిక్షణ ఇయ్యాలె

గ్రామీణ యువతకు వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ, మార్కెటింగ్‌‌పై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నిరంజన్​రెడ్డి అన్నారు. వ్యవసాయం వైపు యువతని ఆకర్శించడం సవాల్ అని ‘ట్రస్ట్ ​ఫర్ ​అడ్వాన్స్​మెంట్​ఆఫ్​ అగ్రికల్చర్​ సైన్సె​స్’  చైర్మన్  పరోడా అన్నారు.

ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ 

వర్సిటీలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ను నిరంజన్​రెడ్డితో కలిసి గవర్నర్ ప్రారంభించారు. ప్రదర్శనలో రైతులు, సైంటిస్టులు, వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలు, స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. వ్యవసాయం, ఉద్యాన పంటల సాగుకు పనికొచ్చే ఉత్పత్తులు, విత్తనాలు, యంత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

need to attract young people towards agriculture: governor Thamilisai

Latest Updates