పిల్లలూ క్రీడల్లోకి రావొద్దు : న్యూజిలాండ్ క్రికెటర్

neeshams-heartbreaking-message-post-world-cup-defeat

ఉత్కంఠ పోరులో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా… న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ  పోస్ట్‌ చేశాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు అభినందనలు తెలియజేశాడు నీషమ్‌. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు… ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు.

Latest Updates