నీట్‌, జేఈఈపై రాజకీయాలు అనవసరం: పోఖ్రియాల్

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై వివాదం రేగుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎగ్జామ్స్‌ నిర్వహించడం ఏంటని ప్రతిపక్షాలు సర్కార్‌‌పై మండిపడుతున్నాయి. ఎగ్జామ్స్‌ నిర్వహించాలని స్టూడెంట్స్‌, పేరెంట్స్‌ ఒత్తిడి చేస్తున్నారని హెచ్‌ఆర్‌‌డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఆయన మరోమారు స్పందించారు. ఈ పరీక్షలపై రాజకీయాలు అవసరం లేదన్నారు. ఎగ్జామ్స్‌కు సంబంధించి తీసుకోనున్న జాగ్రత్త చర్యలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీలు)ను విడుదల చేసింది.

‘స్టూడెంట్స్ సేఫ్టీ, కెరీర్ మాకు చాలా ముఖ్యం. ఎన్‌టీఏ ఈ పరీక్షలకు సంబంధించి గైడ్‌లైన్స్‌తోపాటు ఎస్‌ఓపీలను సిద్ధం చేసింది. గత మే–జూన్ నెలల్లో పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎగ్జామ్స్ నిర్వహించాలని మెయిల్స్‌తోపాటు పలు విధాలుగా తమ అంగీకారం, మద్దతు, కోరికను తెలియజేశారు. స్టూడెంట్స్‌ సౌలభ్యం మేరకు ఎన్‌టీఏ తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో విద్యార్థులు ప్రయాణించాల్సిన అవసరం తప్పింది. ఇప్పుడు 99% మంది స్టూడెంట్స్‌కు సెంటర్స్ విషయంలో స్వచ్ఛందంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది’ అని పోఖ్రియాల్ పేర్కొన్నారు.

Latest Updates