ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో సర్కార్ పనితీరు బాగాలేదు

  • రాష్ట్రంలో ఎడ్యుకేషన్, హెల్త్ బాగలేవ్
  • నీతిఆయోగ్ అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో తెలంగాణ సర్కారు పనితీరు సరిగ్గా లేదని నీతి ఆయోగ్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ప్రగతి భవన్​లో శుక్రవారం సీఎం కేసీఆర్​తో సమావేశమైన నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ బృందం వివిధ రంగాల్లో రాష్ట్ర సర్కారు పనితీరుపై చర్చించింది. ఇందులో భాగంగా హెల్త్, ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. టీచర్ల రిక్రూట్​మెంట్ లేకపోవడం, ప్రొఫెసర్లు, యూనివర్సిటీలకు వైస్​ చాన్స్​లర్లను నియమించకపోవడం, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని చెప్పినట్లు సమాచారం. లిటరసీ తక్కువగా ఉండడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కరోనా టైంలో టెస్టులు సరిగ్గా చేయలేదని  తెలిపారు. నర్సుల రిక్రూట్మెంట్ లేదని, పీహెచ్​సీల స్థాయిలో ప్రజలకు మంచి వైద్యం అందించడంలో ఫెయిల్ అవుతున్నారని, సీరియస్​గా పనిచేయాలని సూచించారు. మండల స్థాయిలో ఎమర్జెన్సీ సర్వీసులు అందేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ, రైతులకు ఉచిత కరెంట్ పథకాలను నీతిఆయోగ్ టీమ్‌ ప్రభుత్వాన్ని అభినందించింది.

For More News..

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

Latest Updates