యాంటీజెన్ లో నెగెటివ్.. డౌటే?

ఆ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన 65 %
మందికి ఆర్టీపీసీఆర్లో పాజిటివ్
ముంబైలోని రెండు ల్యాబుల
టెస్టు రిజల్ట్స్ పరిశీలనలో వెల్లడి

రిజల్ట్స్ తొందరగా వస్తుందనుకున్న యాంటీజెన్ టెస్టుల్లో రిపోర్టులు తప్పుగా వస్తున్నాయి. లక్షణాలున్న చాలా మంది పేషెంట్లకు యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వస్తుండగా.. ఆర్పీటీ సీఆర్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలుతోంది. ముంబైలోనే ఎక్కువగా ఫాల్స్ నెగెటివ్ లు వస్తున్నాయి. ముంబైలోని రెండు ల్యాబుల్లో చేస్తున్న యాంటీజెన్ టెస్టుల రిపోర్టులను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. యాంటీజెన్ టెస్టుచేసుకున్న వాళ్ల‌లో లక్షణాలున్న 65 శాతం మంది పేషెంట్లకు నెగెటివ్ రాగా..ఆర్పీటీ సీఆర్ టెస్టుల్లోపాజిటివ్ గా తేలినట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో మాత్రం 15% మేర ఫాల్స్ నెగెటివ్ రిజల్స్ ట్ తక్కువగానే వస్తుండడంతో యాంటీజెన్ టెస్టులనే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కువగా చేస్తోంది. ఈ తేడాలతో యాంటీ జెన్టెస్టులను తమిళనాడు తక్కువగా చేస్తోంది. ఆర్పీటీసీ ఆర్టెస్టులపైనే ఆధారపడుతోంది. ‘‘యాంటీజెన్టెస్టుల్లో ఫలితాలు తప్పుగా వస్తున్నాయి. అత్యంత నమ్మదగిన ఆర్పీటీసీ ఆర్టెస్టులనే ఎక్కువగా చేస్తున్నాం.’’ అని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్ చెప్పారు.

తెలంగాణలో 7 శాతం..!

యాంటీజెన్ టెస్టులతో ఫాల్స్ నెగెటివ్లు ఎక్కువగా వస్తుండడంతో పాజిటివ్ పేషెంట్లకు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ పి.ఉమానాథ్ చెప్పారు. కర్నాటక కూడా యాంటీజెన్ టెస్టులను తక్కువగానే చేస్తోంది. ఆ టెస్టులను పూర్తిగా నమ్మడానికిలేదని, అందుకే తక్కువగా చేస్తున్నామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలో చేస్తున్న మొత్తం టెస్టుల్లో60–70% యాంటీజెన్ టెస్టులే. అయితే, ఫాల్స్ నెగెటివ్ ల‌పై ఎలాంటి డేటా లేదు. 7% వరకు ఉండొచ్చని అధికారుల అంచనా. యాంటీజెన్ టెస్టింగ్ సెన్సిటివిటీ తక్కువ అని, అరగంటలోనే రిజల్ట్స్ చేస్తుండడంతో దీనిపైనే ఆధారపడుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates