డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరీంనగర్: సమచార హక్కు చట్టం కింద పౌరులు అడిగే ప్రశ్నలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అధికారులు.. ఆ సమాచారం మా దగ్గర లేదు.. అందుకే ఇవ్వలేకపోతున్నామంటూ డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం ప్రదర్శించిన కరీంనగర్ ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ అధికారి) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి) ఇద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు జారీ చేసిన ఆదేశాలు సంచలనం సృష్టించాయి.

పౌరులు అడిగిన సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించి ఇవ్వాల్సిన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం బహిరంగ రహస్యం. డొంక తిరుగుడుగా.. అస్పష్టమైన సమాధానాలతో ప్రశ్నలు అడిగిన వారి సహనాన్ని పరీక్షించేలా.. వీలైనంత కాలయాపన చేస్తుంటారు. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేకుండా చేయడంలో అధికారులు.. వారి సిబ్బంది ఆరితేరారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో బొమ్మకల్ భూమాఫియాలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు బేతి మహేందర్ కోర్టును ఆశ్రయించారు. ఒక న్యాయవాదిగా తాను ఆర్టీఐ ద్వారా అడిగిన పిటిషన్ కు నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు ఆర్డీవో, ఏ.ఓ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

ఆర్టీఐ ప్రశ్నకు అధికారుల సమాధానం.. ఇదే

 

 

 

Latest Updates