‘కోర్టుకు చెప్పేందుకే చర్చలకు రమ్మన్నరు’

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి కోర్టు స్ఫూర్తిని అధికారులు తుంగలో తొక్కారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 21 అంశాలపైనే అధికారులు పట్టబట్టడంతో చర్చలు విఫలమయ్యాయన్నారు.

ఆర్టీసీని లేకుండా చేస్తామన్న సీఎం ప్రకటనను అమలు చేయడానికే చర్చలను విఫలం చేశారని శనివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. కోర్టుకు సమాధానం చెప్పేందుకే చర్చలకు పిలిచారు తప్ప సమస్యల పరిష్కారానికి కాదన్నారు. బారికేడ్లు పెట్టి, ఆర్టీసీ జేఏసీ నేతలను స్కాన్ చేసి, ఫోన్లు లాక్కోవడం అవమానించడమే అన్నారు. సీఎం ఆదేశాలతోనే అధికారులు అలా వ్యవహరించారని ఆరోపించారు.

Latest Updates