జీహెచ్ఎంసీలో హంగ్..మేయర్ పీఠం ఎవరికి.?

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. సెంచరీ కొడ్తామని ప్రకటించిన టీఆర్ఎస్ అంచనాలు తలకిందులై.. 55 సీట్లకే పరిమితమై సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బీజేపీ 48 డివిజన్లతో రెండో ప్లేస్లో నిలవగా.. ఎంఐఎం 44, కాం గ్రెస్ రెండు సీట్లు సాధించాయి. మరో డివిజన్ ఫలితం పెండింగ్ లో ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. మేయర్ ఎన్నికకు అవసరమైన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి కంటే ఎక్కువ మంది మద్దతు కావాలి. దీనికితోడు ఎక్స్ అఫీషియో మెం బర్లుగా ఉండే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకూ మేయర్ ఎన్నికలో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్లనూ కలిపి మొత్తం ఓట్ల సంఖ్యను నిర్ధారిస్తారు.

మజ్లిస్ హెల్ప్ తోనే మేయర్ సీటు

మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ మేయర్ పదవి తీసుకుని.. ఆ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ప్రత్యక్షంగా మజ్లిస్ సహకారం తీసుకుంటే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో.. పరోక్షంగా హెల్ప్ తీసుకుని మేయర్ సీటును టీఆర్ఎస్ సొంతం చేసుకుని చాన్స్ ఉందని పార్టీ లీడర్లు భావిస్తున్నారు. మేయర్ సీటు గెలిచేందుకు సగం కంటే ఎక్కువ మెం బర్స్ బలం అవసరం. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి జీహెచ్ఎంసీలో 194 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం కంటే ఎక్కువ మంది.. అంటే 98 మంది మద్దతున్న పార్టీ మేయర్ పదవిని గెలుచుకుంటుం ది. కానీ టీఆర్ఎస్ కు 86 మంది ఓటర్లు (55 మంది కార్పొరేటర్లు+ 31 మంది ఎక్స్ అఫీషియోలు) మాత్రమే ఉన్నారు. మేయర్ సీటు గెలుచుకునేందుకు మరో 12 ఓట్లు కావాలి. అంటే మజ్లిస్ పార్టీ నేరుగా సపోర్ట్ చేయడమో, ఓటింగ్ కు హాజరుకాకుండా ఉండటమో చేస్తే… టీఆర్ఎస్ మేయర్ సీటును గెలుచుకునే చాన్స్ ఉంటుంది. నిజామాబాద్ తరహాలో.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ నేరుగానే మజ్లిస్ సహకారం తీసుకుంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి . బీజేపీ 28 డివిజన్లలో గెలిచి సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. మేయర్ పదవి దక్కించుకోవడానికి 30 మంది అవసరం. దీంతో టీఆర్ఎస్ నేరుగా మజ్లిస్ హెల్ప్ తో పాటు ఎమ్మెల్సీలు గంగాధర్, రాజేశ్వర్ రావు, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డిలతో ఎక్స్ అఫీషియో మెం బర్లుగా ఓట్లు వేయించుకుని మేయర్ పదవిని దక్కించుకుంది.

పరోక్షంగానే సపోర్టు!
జీహెచ్ఎంసీ మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేరుగా మజ్లిస్ సాయం తీసుకునే చాన్స్ తక్కువగా ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రత్యక్షంగా సహకారం తీసుకుంటే బీజేపీ నుంచి, ప్రజల నుంచి విమర్శలు వస్తాయన్న భయం వ్యక్తమవుతోందని అంటున్నారు. అందుకని మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ ఓటర్లు కొందరు దూరంగా ఉండటమో, ఎన్నికను బాయ్ కాట్ చేయడమో జరిగేలా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే చాన్స్ ఉందని చెప్తున్నారు.

Latest Updates