మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

nekkonda intermediate student commits sucide

ఇంటర్మీడియేట్ మార్కుల జాబితాలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామానికి చెందిన నవీన్ అనే విద్యార్ధి మంగళవారం రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

నవీన్ ఈ ఏడాది నెక్కొండలోని గాయత్రి ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. ఫలితాలలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు రావడంతో..  మనస్తాపం చెంది స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు విజయ, వెంకన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Latest Updates