మోడీకి శుభాకాంక్షలు తెలిపిన నేపాల్ పీఎం ఓలి

ఖాట్మండు: దేశంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆరంభమయ్యాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పలు కీలక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్రాల్లో కూడా ఇండిపెండెంట్స్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పీఎం మోడీకి ఇండిపెండెంట్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా మోడీకి ఓలి కంగ్రాట్స్ చెప్పారు.

‘కంట్రాట్స్ ప్రధాని మోడీజి. ఇండియా ప్రభుత్వానికి, ప్రజలకు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజల మరింత పురోగతి, శ్రేయస్సుకు బెస్ట్ విషెస్ చెబుతున్నా’ అని ఓలి ట్వీట్ చేశారు. ఇండియా భూభాగంలోని కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకొని నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడంతో ఇరు దేశాల సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న నేపథ్యంలో ఓలి ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకొంది.

Latest Updates