నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా ఖాయమేనా?

న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేస్తారని ఊహాగానాలు పెరిగిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ దేశ ప్రెసిడెంట్‌ను కలవనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. నేపాల్ అధ్యక్షుడు బిధ్యా దేవి భండారితో మీటింగ్ ముగిసిన వెంటనే ఓలి కేబినెట్ భేటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారని సమాచారం. ‘ఈ రోజు దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ఓలి మాట్లాడొచ్చు. టైమ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం పూర్తయ్యాయి. కేబినెట్ మీటింగ్ ముగిసిన వెంటనే దీనిపై స్పష్టత రావొచ్చు’ అని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. రీసెంట్‌గా ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసినందుకు గాను ఓలి రాజీనామా చేయాలని నేపాల్ మాజీ ప్రధాని ప్రచండతోపాటు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఓలి వ్యాఖ్యలు రాజకీయంగా సరైనవి కావని అదే సమయంలో దౌత్య పరంగానూ కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Latest Updates