మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదు.. బాధిత మహిళలకు అండగా ఉంటాం: నేరెళ్ల శారద

మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదు.. బాధిత మహిళలకు అండగా ఉంటాం: నేరెళ్ల శారద
  • మహిళా కమిషన్ చైర్‌‌ పర్సన్‌‌ గా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా అండగా ఉంటామని, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మహిళల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. గురువారం హైదరాబాద్ లోని బుద్ధ భవన్‌‌ లో గల మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ, సిబ్బంది స్వాగతం పలికారు. 

అనంతరం తన ఛాంబర్‌‌ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన నేరెళ్ల శారద.. చైర్‌‌ పర్సన్‌‌ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై పూర్తి నమ్మకంతో రెండోసారి మహిళా కమిషన్ చైర్‌‌ పర్సన్‌‌ గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆమెను అభినందించిన వారిలో  బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్,  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు, టీజీఐఐసీ  మాజీ చైర్‌‌ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, శాసనమండలి విప్ బల్మూర్ వెంకట్, ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కి, మహిళా కమిషన్ సభ్యులు చిట్యాల శ్వేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు ఉన్నారు.