నెస్‌ వాడియాకు రెండేళ్ల జైలు

వాడియా గ్రూప్‌ వారసుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కో ఓనర్ నెస్ వాడియాకు డ్రగ్స్‌ కేసులో జపాన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హాలీడే కోసమని మార్చిలో జపాన్‌ వెళ్లిన వాడియాను న్యూచితోస్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 25 గ్రాముల డ్రగ్స్‌ (కన్నిబిస్‌ రెసిన్‌) దొరికాయి. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారించిన సపోరో డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం జైలు శిక్ష ఖరారు చేసింది. తన దగ్గర డ్రగ్‌ ఉందని వాడియా ఒప్పుకున్నారని, కానీ అది తాను వాడుకోవడానికేనని వాడియా చెప్పినట్టు ఓ కోర్టు అధికారి తెలిపారు. వాడియాకు జైలు శిక్ష పడటంతో ఆయన కంపెనీల షేర్ల విలువ మంగళవారం 10 శాతం పడిపోయింది.

Latest Updates