నేతాజీ చరిత్ర తెరమరుగు కాకుండా చూడాల్సిన భాధ్యత మనందరిది

అవినీతి, నియంతల పాలనను ఎదిరించండి – బండి సంజయ్ పిలుపు

హైదరాబాద్:  నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ కోసం రక్తం చిందిస్తే.. అవినీతిపరులు, నియంతలు రాజ్యమేలుతున్నారని.. అవినీతి, నియంతల పాలనను ధైర్యంగా ఎదిరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ దివాస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు  ప్రేమెందర్ రెడ్డి,  ప్రదీప్ కుమార్ రావు, పలువురు బీజేపీ నేతలు,  కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మనందరికీ నేతాజీ  సుభాష్ చంద్రబోస్ ఆదర్శం అన్నారు. నాయకత్వానికి నిదర్శనమైన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్నారు. నేతాజీ పరక్రమాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకునేలా భవిష్యత్తు తరాల కోసం పరాక్రమ దివాస్  పేరుతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని వివరించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వేచ్చను ఇస్తాను’’ అన్న గొప్ప నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఈయన చరిత్ర తెరమరుగు కాకుండా చూడాల్సిన భాధ్యత అందరిపై ఉంది’’ అన్నారు. అన్యాయం, అక్రమాలను ఎదిరించాలని చెప్పిన నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణా రాష్ట్రంలో కూడా అక్రమాలను అవినీతిని నియంత పాలనను ఎదిరించాలన్నారు. తెలంగాణలో రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నియంత, అవినీతి అక్రమా పాలన నుంచి కాపాడుకునేందుకు ప్రతి యువకుడు బీజేపీకి అవకాశం, సమయమివ్వాలని కోరారు. తెలంగాణలోని యువత ప్రత్యేక రాష్ట్రం కోసం రక్తం చిందిస్తే , ఆ అమరుల రక్తంతో నియంతలు, అవినీతిపరులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలనుకుంటే ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీకి సమయాన్ని ఇవ్వాలని కోరారు.  ప్రజలు కూడా బిజెపి కు అండగ ఉండాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకొని  తెలంగాణా రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనను తరిమికొట్టాలని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిజ్ఞ తీసుకుంటున్నారని వివరించారు.

For More News..

బిల్డింగులు కట్టుకోండి.. ఎవడు ఆపుతడో చూస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఫోన్ ఉంటేనే రేషన్.. బయోమెట్రిక్ బదులు ఓటీపీ సిస్టమ్

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

Latest Updates