థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ మోడీ: ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్

జెరూసలెం: హైడ్రాక్సిక్లోరోక్విన్ ను సప్లయ్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు థ్యాంక్స్ చెప్పారు. “థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ. క్లోరోక్విన్ ను పంపినందుకు ఇజ్రాయెల్ ప్రజలందరి తరపున ధన్యవాదాలు” అని ఆయన ట్వీట్ టేశారు. ఇజ్రాయెల్ లో 10 వేల మందికి కరోనా సోకగా, 121 మంది చనిపోయారు. తమ దేశంలో కరోనా ప్రబలిన వెంటనే మార్చి 13న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాస్కులు, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతికి అనుమతించాలని కోరారు. ఏప్రిల్ 3న మరోసారి ఫోన్ చేసి క్లోరో క్విన్ కూడా పంపాలని విజ్ఞప్తి చేశారు. క్లోరోక్విన్ తోపాటు ఐదు టన్నుల మెడిసిన్ ను మన దేశం ఇజ్రాయెల్ కు పంపింది. అమెరికాకు సైతం మన దేశం క్లోరోక్విన్ పంపిన విషయం తెలిసిందే. ఇండియా సాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని, ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశంసించారు.

Latest Updates