సక్సెస్ బాటలో  నెట్‌‌ఫ్లిక్స్‌

జీరో నుంచి హీరో..

డీవీడీ రెంటల్ కంపెనీగా మొదలై… గ్లోబల్ స్ట్రీమింగ్ లీడర్ గా..

బిలియన్‌‌ల కొద్దీ రెవెన్యూతో ఆన్‌‌లైన్‌‌ స్ట్రీమింగ్‌ లో అందనంత ఎత్తుకి
ఫౌండర్ల ముందు చూపు, సాహసోపేత నిర్ణయాలతోనే సక్సెస్‌

ఇప్పటి తరానికి ఓటీటీ (ఓవర్‌‌ ది టాప్‌‌) అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఓ పదేళ్ల కిందట ఓటీటీ అంటే తెలీని వాళ్లు చాలా మందే. అలాంటి టైమ్‌‌లో ఇంటర్‌‌నెట్‌‌ దూసుకెళ్తున్న తీరు చూసి, ఓ కొత్త ఐడియాతో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది ఓ కంపెనీ. ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఇష్టపడే  20 కోట్ల మందికి దగ్గరైన ఈ కంపెనీనే నెట్‌‌ఫ్లిక్స్‌‌. డీవీడీలు రెంట్‌‌కి ఇచ్చే బిజినెస్‌‌తో మొదలైన నెట్‌‌ఫ్లిక్స్‌‌ జర్నీ చాలా ఆసక్తికరమైనదనే చెప్పొచ్చు. ఇండియాలోనూ ఇప్పుడు కోటి మందికి పైగా యూజర్లను సంపాదించుకుంది ఈ కంపెనీ. హిందీ, తెలుగు, తమిళ్‌‌ సినిమాలనూ తన ప్లాట్‌‌ఫామ్‌‌లో  రిలీజ్‌‌ చేసి, అందరినీ అలరిస్తోంది.

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగుథియేటర్లలో రిలీజ్‌‌ అయిన సినిమాలను రెంట్‌‌కు ఇచ్చే బిజినెస్‌‌ నుంచి తన ప్లాట్‌‌ఫామ్‌‌లోనే సినిమాలు రిలీజ్‌‌ చేసే లెవెల్‌‌కి ఎదిగింది ఆన్‌‌లైన్‌‌ స్ట్రిమింగ్‌‌ కంపెనీ నెట్‌‌ఫ్లిక్స్‌‌. ప్రస్తుతం గ్లోబల్‌‌ ఓవర్‌‌‌‌ ది టాప్‌‌(ఓటీటీ) సెగ్మెంట్‌‌లో మిగిలిన కంపెనీలకు అందనంత రేంజ్‌‌లో నిలుచుంది. ఈ సక్సెస్‌‌ అంతా నెట్‌‌ఫ్లిక్స్‌‌కు రాత్రికి రాత్రే రాలేదు.  ఫౌండర్లు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ముందు చూపు  నెట్‌‌ఫ్లిక్స్‌‌ను ఇప్పటి పొజిషన్‌‌కి చేర్చాయి.  నెట్‌‌ఫ్లిక్స్‌‌ సక్సెస్‌‌ ఫుల్‌‌ జర్నీ  నేటి యంగ్‌‌ జనరేషన్‌‌కు ఓ గైడ్‌‌ లాంటిదే.

అమెరికాకు చెందిన మార్క్‌‌ రాండల్ఫ్‌‌, రీడ్‌‌ హ్యాస్టింగ్‌‌ 1997 లో నెట్‌‌ఫ్లిక్స్‌‌ పేరుతో ఓ డీవీడీ రెంటల్‌‌ కంపెనీని మొదలెట్టారు. అప్పటి ఓ చిన్న సంఘటన నెట్‌‌ఫ్లిక్స్‌‌ ఐడియాకు దారితీసింది. రెంటల్‌‌కు తీసుకున్న ఓ సినిమాకు హ్యాస్టింగ్‌‌  40 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. అప్పటి వరకు ఏదో బిజినెస్‌‌ను స్టార్ట్‌‌ చేయాలని చూస్తున్న ఈ స్నేహితులకు డీవీడీ రెంటల్‌‌ బిజినెస్‌‌ ఆలోచన వచ్చింది. ఈ ఐడియానే నెట్‌‌ ఫ్లిక్స్‌‌ పుట్టడానికి కారణమయ్యింది.  మొదట్లో కేవలం 30 మంది ఉద్యోగులతో కలిసి 935 సినిమాలను నెట్‌‌ఫ్లిక్స్‌‌ రెంట్‌‌కు ఇచ్చేది. కంపెనీ మొదటి వెబ్‌‌పేజిని 1998 లో ర్యాండల్ఫ్‌‌, రీడ్‌‌ హ్యాస్టింగ్‌‌ క్రియేట్‌‌ చేశారు. అప్పటి వరకు ఉన్న   పేమెంట్‌‌ విధానాన్నీ మార్చారు. మొదట్లో  సినిమాకి ఇంతని రెంటల్‌‌ తీసుకునేవారు. ఆ తర్వాత నుంచి నెల వారీ సబ్‌‌స్క్రిప్షన్ పద్దతిలో పేమెంట్స్‌‌ను తీసుకొచ్చారు.  అప్పటికే  మార్కెట్‌‌లో పాపులర్‌‌‌‌గా నడుసున్న వీడియో హోమ్‌‌ సిస్టమ్‌‌(వీహెచ్‌‌ఎస్‌‌)ను వదిలి కొత్తదారైన డీవీడీ సెగ్మెంట్‌‌లో నెట్‌‌ఫ్లిక్స్‌‌ అడుగుపెట్టింది.  ఈ నిర్ణయానికి కట్టుబడి కంపెనీని నడిపించారు ఫౌండర్లు.  ఆ తర్వాత డీవీడీ మూవీస్‌‌ ట్రెండ్‌‌ ఊపందుకుంది. 2000 ఏడాది నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌‌ తమ రెంటల్‌‌ బిజినెస్‌‌లో చాలా మార్పులు తీసుకొచ్చింది. అప్పటి వరకు కేవలం ఒక్క సినిమానే రెంటల్‌‌గా ఇచ్చే ఈ కంపెనీ,  ఆ తర్వాత ప్యాకేజిని బట్టి ఎన్ని మూవీస్‌‌నైనా రెంట్‌‌కు తీసుకోవడానికి అవకాశం కల్పించింది.  కానీ ముందు తీసుకున్న సీనిమాలను రిటర్న్‌‌ చేస్తేనే కొత్తవి ఇవ్వడం ప్రారంభించింది. వీటిపై డ్యూ డేట్‌‌, షిప్పింగ్‌‌ ఛార్జీలు, హ్యాండ్లింగ్‌‌ ఫీజులను వసూలు చేయడం నిలిపేసింది.

డీవీడీ ట్రెండ్‌‌ ఉన్నా.. ఆన్‌‌లైన్‌‌ వైపు

డీవీడీ ట్రెండ్‌‌ నడుస్తున్న టైమ్‌‌లోనే ఇంటర్నెట్‌‌ రివల్యూషన్‌‌ను నెట్‌‌ఫ్లిక్స్‌‌ ఊహించగలిగింది. ఈ ఆలోచనే గ్లోబల్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ సెక్టార్‌‌‌‌ను మార్చేసింది. 2006 మొదటి సారిగా ఆన్‌‌లైన్ స్ట్రిమింగ్‌‌ సర్వీస్‌‌ను నెట్‌‌ఫ్లిక్స్‌‌ స్టార్ట్‌‌ చేసింది. డిజిటల్‌‌ టెక్నాలజీని, ఇంటర్నెట్‌‌ రివల్యూషన్‌‌ను అర్థం చేసుకున్న నెట్‌‌ఫ్లిక్స్‌‌ తన ప్రత్యర్థి కంపెనీల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే నిలిచేది.   ఎప్పుడైతే ఆన్‌‌లైన్‌‌ స్ట్రిమింగ్‌‌ సర్వీస్‌‌ను స్టార్ట్‌‌ చేసిందో అప్పటి నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌‌ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తన ఆన్‌‌లైన్‌‌ లైబ్రరిలో సూపర్‌‌‌‌హిట్‌‌ వీడియోలు, మూవీలు, డాక్యుమెంటరీలు వంటి వాటిని పెంచింది. దీంతో కస్టమర్లను  ఆకర్షించడంలో తొందరగా విజయవంతం అయ్యింది.  కంపెనీ  ఇతర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్లు నెట్‌‌ఫ్లిక్స్‌‌కు ఫ్లస్‌‌గా మారాయి. స్టార్జ్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌, లయన్స్‌‌ గేట్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌, ఎంజీఎం, పారామౌంట్‌‌ పిక్చర్స్‌‌ వంటి పాపులర్‌‌‌‌ కంపెనీలతో అగ్రిమెంట్‌‌ కుదుర్చుకున్న నెట్‌‌ఫ్లిక్స్‌‌, మిలియన్‌‌ డాలర్లను రాల్చే సూపర్‌‌‌‌ హిట్‌‌ సినిమాలను తమ ఆన్‌‌లైన్ కస్టమర్లు అందిచింది. 2008 నుంచి కంపెనీ ఆన్‌‌లైన్ సర్వీస్‌‌ బిజినెస్ భారీగా ఊపందుకుంది.  కంపెనీ తన సొంత సినిమాలు,  వీడియో సిరీస్‌‌లను తీసుకురావడం మొదలెట్టింది.  తన సొంత ప్రొడక్షన్‌‌లో కంటెంట్‌‌ను తీసుకురావడంలో భారీగా నష్టపోయే అవకాశం ఉన్నా,  నెట్‌‌ఫ్లిక్స్‌‌ వెనక్కి తగ్గలేదు.

కస్టమర్ల కోసం మళ్లీ పాత షో్లు..

సక్సెస్‌ అయిన, ఎక్కువ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న పాత షోలను మళ్లీ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది నెట్‌ ఫ్లిక్స్‌ . ఇదే కంపెనీ సక్సెస్‌ కు ప్రధాన కారణమని చెప్పొచ్చు. మిగిలిన ఓటీటీలలా అడ్వర్టయిజింగ్‌ రెవెన్యూపై కాకుండా కంపెనీ ట్రెడిషనల్‌ మార్గం లోనే కస్టమర్లకు చేరువైంది. ఇదే నెట్‌ ఫ్లిక్స్‌ కంపెనీని ఇతర ఓటీటీల నుంచి వేరు చేస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ సక్సెస్‌ లో ఆ కంపెనీ యాప్‌ ది చాలా ఇంపార్టెంట్  పాత్ర. తన యాప్‌ ను వెబ్‌, అండ్రాయిడ్‌, ఐఓఎస్‌, రొకూ, ప్లేస్టే షన్‌, ఎక్స్‌ బాక్స్‌, యాపిల్ టీవీ, అండ్రాయిడ్‌ టీవీ వంటి ప్లాట్‌ ఫామ్‌ లకు తగ్గట్టు ఎప్పటికప్పుడు నెట్‌ ఫ్లిక్స్‌ అప్‌ గ్రేడ్‌ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్‌ కు గ్లోబల్‌ గా 19.3 కోట్ల మందికి పైగా యాక్టివ్‌‌ సబ్‌ స్క్రయిబర్లు ఉన్నారు . ఇండియాలో ఈ కంపెనీకి 1.02 కోట్ల మంది సబ్‌ స్ర్కయిబర్ల బేస్‌ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ –జూన్‌ క్వార్టర్‌ లో 6.14 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ నెట్‌ ఫ్లిక్స్‌ కు వచ్చింది.

Latest Updates