కరోనా కష్టం: డెలివ‌రీ బాయ్‌గా నెదర్లాండ్ క్రికెటర్‌

కరోనా సృష్టించిన కల్లోలంతో గ్రౌండ్ లో క్రికెట్ ఆడాల్సిన ఓ క్రికెటర్…డెలివరీ బాయ్ గా మారాడు. కరోనా వైరస్ ధాటికి ఒలింపిక్స్‌, టీ 20, వరల్డ్ కప్తో సహా మెగా క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియాలో అక్టోబర్‌ 18 నుండి నవంబర్‌ 15 వరకు టీ 20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. కరోనా విజృంభణతో ప్రపంచకప్‌ను వాయిదా వేశారు. దీంతో నెదర్లాండ్స్‌కు చెందిన క్రికెటర్‌ పాల్‌వాన్‌ మీకెరెన్‌ డెలివరీ బాయ్ గా మారాడు.

దేశం తరపున ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాల్సిన పాల్‌వాన్‌ మీకెరెన్‌ పూట గడవడం కోసం ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కరోనా ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలన్నిటినీ దెబ్బతీసిందని.. లేదంటే ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతూ ఉండాల్సిందిగా ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు పాల్‌వాన్‌.

నెదర్లాండ్స్‌ టీమ్ లో కీలక బౌలర్‌ అయన పాల్‌వాన్‌ ఇప్పటి వరకు 5 వన్డేలు, 39 T20లు ఆడారు. పొట్టి ఫార్మాట్‌లో 47 వికెట్లు సాధించాడు.

Latest Updates