మీకు ధోనీకి అదే తేడా.. దేశం గురించి ఆలోచించు కోహ్లీ.. ఫ్యామిలీ తరువాత

తన భార్య అనుష్క డెలివరీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ 15 పెటర్నిటి ( పితృత్వ సెలవులు) లీవ్ తీసుకున్నారు. అయితే కోహ్లీ పెటర్నిటీ లీవ్ పై  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు దేశం గురించి ఆలోచించండి…ఫ్యామిలీ గురించి కాదు. దేశానికి సేవ చేయడం కన్నా గర్వించ దగ్గ విషయం ఏముంటుందని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు  2015లో జరిగిన వరల్డ్ కప్ సందర్భంగా ధోని తన కుమార్తె జీవా డెలివరీ సందర్భంగా తనకు నేషన్ ఫస్ట్ ..ఫ్యామిలీ నెక్ట్స్ అంటూ మ్యాచ్ లను ఆడారు. ఇప్పుడే అదే విషయాన్ని గుర్తు చేస్తూ కోహ్లీకి, ధోనికి మధ్య తేడా అదేనని అంటున్నారు.

అయితే మరికొందరు కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. 8,9 ఏళ్ల నుంచి దేశం కోసం నిర్విరామంగా ఆడుతున్నారు. పెటర్నిటీ లీవ్ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా నా భార్య  తొలి డెలివరీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఈ ఆనంద సమయాల్ని ఫ్యామిలీతో గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను భారత్ – ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా టెస్ట్ మ్యాచ్ కు హాజరవుతానంటూ బీసీసీఐని కోరారు. అదే వీడియోను బీసీసీఐ  ట్వీట్ చేయడంతో క్రికెట్  అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు.

Latest Updates