వైరల్ అవుతున్న ట్రంప్ సైన్: ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా తాజ్ మహల్ తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమం సందర్శకుల డైరీలో ప్రధాని మోడీ గురించి ప్రస్తావించారు. ‘నా గొప్ప స్నేహితుడు, ప్రధాని మోడీకి ఈ అద్భుతమైన సందర్శనకు ధన్యవాదాలు’ అని రాశారు. అంతవరకు బాగానే ఉన్న కింద ట్రంప్ చేసిన సంతకంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఈసీజీని తలపించేలా సైన్ ఉండడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా  నెటిజన్లు  ట్రంప్ ను ట్రోల్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ట్రంప్ సంతకం చూపించా ఫార్మసిస్ట్ 3రోజులకు మెడిసిన్ ఇచ్చాడంటూ సాగర్ అనే నెటిజన్  తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు.

నా చిన్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ సైన్ చేసినట్లు నేను సైన్ చేశా. ఆ సైన్ చూసిన నా ఫ్రెండ్ నన్ను డాక్టర్ డాక్టర్ అని పిలిచాడని స్వీట్ మెమోరిస్ గుర్తు చేసుకున్నాడు మరో నెటిజన్.

ట్రంప్ సంతకం నా హెల్త్ ఈసీజీ లా ఉందని ఓనెటిజన్ గుర్తు చేసుకున్నాడు.

see this- అమ్మాయితో మాట్లాడాడని యువకుడికి గుండు కొట్టించి..!

300 ఏళ్లలో మొదటిసారి తాజ్ మహల్ ను క్లీన్ చేశారు

Latest Updates