ట్రాఫిక్ చలాన్: కోహ్లీకి చెడ్డీ మాత్రమే మిగిలిందట..!

చెడ్డీ మాత్రమే వేసుకుని కూర్చున్న ఫొటోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘మనలో మనం చూసుకున్నంత సేపు బయట చూడాల్సిన అవసరం ఉండదు’ అని కేవలం షార్ట్ వేసుకుని వున్న తన ఫోటోను కోహ్లీ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ట్రాఫిక్ చలాన్ కట్టినందుకే నగదుతో పాటు, బట్టలు కూడా పోయాయని, మరికొందరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించినందుకే ఈ పరిస్థితి వచ్చిందేమోనని కామెంట్ చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఒక టూవిలర్ అతనికి భువనేశ్వర్ లో 47,500 రూపాయలను  ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించిన ఘటనతో పాటు మరికొన్ని ఉదాహరణలను చెబుతున్నారు నెటిజన్లు.

 

 

Latest Updates