త్వరలో కొత్త కాయిన్స్

new-20-rupees-coin-to-come-in-exist-soon-says-minister-nirmala

త్వరలో 20 రూపాయిల కాయిన్‌ను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్‌సభలో ఆమె ఈ ప్రకటన చేశారు. 1, 2, 5, 10, 20 డినామినేషన్లలో కొత్త కాయిన్లను తీసుకువస్తామన్నారు. అంధులు కూడా గుర్తించే విధంగా ఈ కాయిన్లను రూపొందించినట్లు సీతారామన్‌ తెలిపారు. కొత్త కాయిన్స్ వచ్చినా.. ఇప్పటికే చలామణీలో ఉన్న అన్ని కాయిన్స్ కూడా చెల్లుతాయని… అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 

Latest Updates