మరో 50 షాపర్స్​స్టాప్​లు

షాపర్స్‌‌‌‌స్టాప్‌‌‌‌  కంపెనీ ఎండీ రాజీవ్‌‌‌‌ సూరి

శరత్‌‌‌‌ సిటీమాల్‌‌‌‌లో అతి పెద్ద స్టోర్సు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  ఫ్యాషన్ రిటైల్‌‌‌‌స్టోర్‌‌‌‌ షాపర్స్ స్టాప్ లిమిటెడ్ హైదరాబాద్‌‌‌‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌‌‌‌లో శుక్రవారం తన ఆరో స్టోర్‌‌‌‌ను మొదలుపెట్టింది. కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్‌‌‌‌ సూరి దీనిని ప్రారంభించారు. ఈ కొత్త సింగిల్ ఫ్లోర్ స్టోర్ దేశంలోని అతిపెద్ద మాల్. దీనిని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎంఏసీ, మై గ్లామ్, క్లినిక్, బివల్గరి, అర్మాని వంటి 200కు పైగా బ్రాండ్స్‌‌‌‌ ఇక్కడ లభిస్తాయి. షాపర్స్ స్టాప్ వెబ్ సైట్,మొబైల్‌‌‌‌ యాప్ నుంచి నచ్చిన ప్రొడక్టులను ఎంచుకొని ఈ స్టోర్‌‌‌‌లో డెలివరీ తీసుకోవచ్చు. కస్టమర్లు తమ పాత దుస్తులను తెచ్చి అవసరమైన వారికి ఉచితంగా ఇవ్వొచ్చు. గూంజ్ అనే స్వచ్ఛందసంస్థ వీటిని పేద కుటుంబాలకు అందజేస్తుంది. కస్టమర్లు ఇక్కడఒక బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌ కొని యాసిడ్ దాడుల బాధితులకు సాయం చేయవచ్చు.

ఈ సందర్భంగా సూరి మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ స్టోర్‌‌‌‌ మా కంపెనీకి 90వ స్టోర్‌‌‌‌ అవుతుంది. మిగతా కంపెనీల స్టోర్లలో ఉన్న వాటికంటే ఇక్కడ అంతర్జాతీయ బ్రాండ్స్‌‌‌‌ ఎక్కువ లభిస్తాయి.  హైదరాబాద్‌‌‌‌లో అమ్మకాలు బాగున్నాయి. ఇక్కడివాళ్లు అంతర్జాతీయ బ్రాండ్ల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. శరత్‌‌‌‌మాల్‌‌‌‌ స్టోర్‌‌‌‌తోపాటు ఈరోజే హైదరాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో నాలుగు స్టోర్లను ప్రారంభించాం. వీటిలో బ్యూటీ స్టూడియో, ఫుడ్‌‌‌‌కోర్టుల వంటివి ఉన్నాయి. ఇండియాలో 42 నగరాల్లో మా స్టోర్లు ఉన్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 50 స్టోర్లు ఏర్పాటు చేస్తాం. మా అమ్మకాలపై స్లోడౌన్‌‌‌‌ ప్రభావం ఏమీ లేదు. షాపర్స్‌‌‌‌స్టాప్‌‌‌‌కు సొంతంగా ఎనిమిది బ్రాండ్లు ఉన్నాయి. మా అమ్మకాల్లో వీటి వాటా 12 శాతం’’ అని ఆయన వివరించారు.

Latest Updates