జులై ఫస్టు నుంచి మేనేజ్​మెంట్​ కాలేజీలు ప్రారంభం

  • ప్రకటించిన ఏఐసీటీఈ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు అందించే గుర్తింపు పొందిన మేనేజ్​మెంట్ కాలేజీల్లో జులై ఫస్టు నుంచి ఆన్ లైన్ మోడ్​లో విద్యాసంవత్సరాన్ని ప్రారంభించవచ్చని ఆల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) ప్రకటించింది. దీని ప్రకారం జులై ఒకటో తేదీ నుంచి ఆన్​లైన్ లో తరగతులు ప్రారంభం అవుతాయి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ సూచనల వచ్చిన తర్వాతే రెగ్యులర్ మోడ్ లో  క్లాసులు నిర్వహించాలని సర్క్యులర్ లో పేర్కొంది. ఫ్రెషర్స్ కు ఆగస్ట్ ఫస్టు నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీసీఎం) కోర్సులు అందించే అన్ని ప్రైవేటు కాలేజీలు ఆన్ లైన్ మోడ్ లో ఇదే అకడమిక్ ఇయర్ ను ఫాలో కావాలని ఆదేశించింది. అయితే కోర్సులకు ఏ రకమయిన ఫీజులు పెంచకూడదని సర్క్యులర్ లో పేర్కొన్నట్లు ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు.

2020–21 సంవత్సరానికి పీజీలో కొత్తగా అడ్మిట్ అవుతున్నవారి నుంచి, రెండో సంవత్సరంలోకి ప్రవేశించే వారి నుంచి ముందస్తుగా పీజులు చెల్లించాలని మేనేజ్బ​మెంట్లు బలవంతం చేయకూడదని చెప్పారు. లాక్​డౌన్ కారణంగా కొన్ని యూనివర్సిటీలు, అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని, వారి నుంచి ఈ ఏడాది డిసెంబర్ లోగా గ్యాడ్యుయేషన్ పూర్తయినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలని ఆయన సూచించారు.

Latest Updates