లీడర్లకు మార్కులేయండి: నేతల రేటింగ్ కు కొత్త యాప్

దేశమంతా లోక్ భ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. నామినేషన్లు మొదలయ్యాయి. ప్రచారం ఊపందుకుంది. నేతల హడావుడీ ఎక్కువైంది. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రా ల్లో లోక్ భ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో జరగనున్నాయి. ఓటర్లూ ఎవరికి ఓటేస్ తేబాగుపడతామని ఆలోచిస్తున్నా రు. మరి మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న నేతల గురించి మీకెంత తెలుసు? వాళ్ల గురించి మీరేమనుకుంటున్నా రు? వారికి రేటింగ్‌ ఇవ్వాలనుకుంటున్నారా? మీ సెగ్మెంట్‌ నేతల ప్రోగ్రెస్‌ కార్డును డిసైడ్‌ చేయాలనుకుంటున్నారా? అయితే స్మార్ట్‌ ఫోన్‌ తీయండి..‘నేత యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఓటేయొచ్చు.. చూడొచ్చు….

నేత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, నియోజకవర్గాన్ని ఎంచుకొని, అక్కడి నుం చి పోటీ చేస్తున్న క్యాండిడేట్లలో మనకు నచ్చిన వ్యక్తిని సపోర్ట్‌ చేయొచ్చు.ఓటేయొచ్చు. ఎవరికెన్ని ఓట్లొచ్చా యో చూడొచ్చు.ఒకరికి ఓటేసిన తర్వాత నచ్చకపోతే మార్చి ఇంకొకరికీ వేయొచ్చు. మన రాష్ట్రం , దేశంలో ఏ అభ్యర్థిని, ఏపార్టీని ఎక్కువ ఇష్టపడుతున్నా రో కూడా తెలుసుకో వచ్చు. యాప్‌లో కాకుండా neta.co.in వెబ్ సైట్‌కు కూడా లాగిన్‌ అయి కూడా ఓటేయొచ్చు. జనరల్‌ ఎలక్షన్లలో ఓటేసేం దుకైతే బీజేపీ, కాం గ్రెస్‌, ఆప్‌, రాజ్ పా,తృణమూల్‌, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, నోటా అని 8ఆప్షన్లు ఇచ్చారు. ప్రధానికి ఓటేసేం దుకు వెరీ యాంగ్రీ నుంచి వెరీ హ్యాప్పీ వరకు ఐదు ఆప్షన్లున్నాయి. ఎన్నికలపుడు ఓటర్ల అభిప్రాయాల ప్రకారం ముందస్తు విశ్లేషణలు అందిస్తోందీ యాప్‌. 2018 ఆగస్టులో స్టార్ట్‌నేత యాప్‌ను కనుగొన్నది ప్రథమ్‌ మిట్టల్‌. పెన్సిల్వెనియా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. తర్వాత సొంతంగా వెం చర్‌ పాక్ట్‌ పేరుతో స్టార్టప్‌ను 2012లో అమెరికాలో మొదలుపెట్టా రు. నేత యాప్‌ సీఈవో రాబిన్‌ శర్మ. సిటిజన్స్‌ ఫర్‌ అకౌంటబుల్ గవర్నెన్స్‌ సంస్థను ప్రశాం త్‌ కిశోర్‌ (జేడీయూయునైటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌)తో కలిసి స్థాపిం చారు. అలాగే యాప్‌ వెనక జర్నలిజంపై ఇష్టము న్నవారు, టెక్నాలజిస్టులు, దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత అందంగా తీర్చి దిద్దా లనుకుంటున్న మీడియా ప్రతినిధులు ఉన్నారు. యాప్‌లో ‘ఇష్యూడ్‌ ఇన్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌’ అని రాసుం ది. యాప్‌ అభివృద్ధి పని 2017 సెప్టెం బర్ లోనే మొదలైంది. 2018 ఆగస్టు 24న ప్రారంభిం చారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Updates