కొత్త కార్లు కొనట్లే.. పాత కార్లు హాట్​కేకు​లే!

  •                 అమ్మకాలు 10 శాతం వరకు జంప్
  •                 44 లక్షల యూనిట్లు విక్రయం
  •                 పాత కార్లపై యువతకు మోజు

ఓ వైపు ప్యాసెంజర్ వెహికిల్ ఇండస్ట్రీ సేల్స్ ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉంటే… మరోవైపు దేశంలో యూజ్డ్ కార్ల అమ్మకాలు మాత్రం శరవేగంగా దూసుకుపోతున్నాయి. పాత కార్ల అమ్మకాలపై ఆర్థిక మాంద్య ప్రభావం ఏ మాత్రం లేదని తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నాయి. పాతకార్లకు దేశంలో అతిపెద్ద ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్.. ఈ ఏడాది పాత కార్ల అమ్మకాలు కనీసం 10 శాతం వరకు పెరుగుతాయని అంచనావేస్తోంది. అంటే ఈ క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44 లక్షల యూనిట్ల వరకు పాత కార్లు అమ్ముడుపోతాయని లెక్కకడుతోంది. ఇదే సమయంలో కొత్త కార్ల అమ్మకాలు 6 శాతం వరకు తగ్గుతాయని పేర్కొంటోంది. 2023 వరకు కూడా పాత కార్ల అమ్మకాలు.. ప్రతేడాది సగటున 10.6 శాతం వరకు వృద్ధి నమోదు చేసి, 66 లక్షల యూనిట్ల అమ్మకాలను రీచ్ అవుతాయని చెబుతోంది. ఇదే సమయంలో కొత్త కార్ల అమ్మకాలు కేవలం 4 శాతం వరకే ఉంటాయని పేర్కొంది. ‘పాతకార్ల కొనుగోళ్లు తగ్గలేదు. ఇండియాలో ప్రస్తుతం ఈ ట్రెండ్ కనబడటం మాకేమీ ఆశ్చర్యంగా లేదు. పలు దేశాల్లో మేము మా వ్యాపారాలను కొనసాగిస్తున్నాం. ఎకానమీలో ప్రతికూల పరిస్థితులున్నప్పడు.. యూజ్డ్ కార్ల ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ స్కైరాకెట్‌‌‌‌‌‌‌‌లా దూసుకుపోతుంది’ అని ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్ ఆటో వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ సన్నీ కటారియా అన్నారు. కార్ల ఇన్వెంటరీ ఎక్కువగా ఉండటంతో, గ్రోత్ కూడా బలంగానే నమోదవుతుందని చెప్పారు. డిమాండ్ కూడా అంతకుముందు కంటే అత్యధికంగానే నమోదవుతుందని తెలిపారు. తమ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే ప్రతికారుకి, 20కి పైగా రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌లు వస్తున్నాయని చెప్పారు. అదీ చాలా తక్కువ సమయంలోనే వస్తున్నట్టు పేర్కొన్నారు.

25 బిలియన్ డాలర్లకు రీచ్…

కొత్త కారు మార్కెట్ కంటే ప్రస్తుతం పాత కార్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీనే 1.3 రెట్లు ఎక్కువగా ఉంది. 2023 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. రెండు లేదా మూడేళ్ల కంటే తక్కువ వయసు ఉండి, 20 వేలు లేదా 30 వేల కిలోమీటర్ల కంటే తక్కువ తిరిగిన కార్లకు మానుఫాక్చరర్ నుంచి వారెంటీ కూడా లభ్యమవుతూ ఉంది. అంతేకాక ట్రాన్సాక్షన్ కూడా తేలికగా అవుతోంది. దీంతో పాత కార్లకు మంచి డిమాండ్ వస్తోంది. మరోవైపు 22 ఏళ్ల నుంచి 37 ఏళ్ల వయసున్న మిలీనియల్స్ కూడా పాత కార్ల కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. వీరు టెక్ ప్రియులవడంతో, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. అంతేకాక మంచి బేరాల కోసం కూడా చూస్తున్నారు.

Latest Updates