కొత్త కార్ల లాంచ్ పోటాపోటీగా మురిపిస్తోన్న ఆటోఎక్స్‌‌పోలు..

 

కొత్త కార్ల లాంచింగ్‌‌తో వాహనదారుల్ని మురిపిస్తున్నాయి ఆటోమొబైల్​ కంపెనీలు. ఇటు ఢిల్లీలో, అటు షికాగోలో పోటాపోటీగా ఆటో ఎక్స్‌‌పోలలో కంపెనీలు కొత్త కార్లను ప్రదర్శిస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతోన్న ఎక్స్‌‌పోలో మన దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఆల్ న్యూ కాంపాక్ట్ అర్బన్ ఎస్‌‌యూవీ ఇగ్నిస్‌‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో కంపెనీ సీఈవో, ఎండీ కెనిచి ఆయుకవ పాల్గొన్నారు. ఎప్పటి నుంచో వేచిచూ స్తోన్న ఎంజీ గ్లోస్టర్‌‌‌‌ ఫుల్ సైజ్ ఎస్‌‌యూవీని కూడా ఢిల్లీ ఎక్స్‌‌పోలో అధికారికంగా ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎస్‌‌యూవీ ఇప్పటికే చైనాలో అమ్మకానికి ఉంది. ఇండియాలో 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఈ ఎస్‌‌యూవీని లాంచ్ చేయనున్నామని ఎంజీ మోటార్ చెప్పింది. నెక్సాన్, హెక్సా, హారియర్ తర్వాత టాటా మోటార్స్ కూడా ఎస్‌‌యూవీ సెగ్మెంట్‌‌లో గ్రావిటస్‌‌ను ఆఫర్ చేస్తోంది. ఇది 7 సీటర్‌‌‌‌తో మార్కెట్‌‌లోకి వస్తోంది. షికాగో ఎక్స్‌‌పోలో హ్యుండయ్ తన సొనాటా హైబ్రిడ్ వెహికిల్‌‌ను ప్రదర్శనకు ఉంచింది. ఫోర్డ్ జీటీ కూడా లిక్విడ్ కార్బన్, గల్ఫ్ రేసింగ్ హెరిటేజ్‌‌తో వాహనదారులను ఆకర్షిస్తోంది.

 

Latest Updates