బాటా CEOగా మొదటి భారతీయుడు

పాదరక్షల తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న కంపెనీ బాటా. స్విట్జర్లాండ్ కు చెందిన బాటా కంపెనీలు..దాదాపు అన్ని దేశాల్లో ఉన్నాయి. భారత్ తో కూడా  బాటా కు మంచి పేరుంది. ఈ సంస్థను స్థాపించింది 1894లో..అయితే ఈ 126 ఏళ్ల కాలంలో మొదటి సారిగా ఓ భారతీయుడు సంస్థ CEOగా నియమితులయ్యారు.

ఇప్పటివరకు బాటా ఇండియా విభాగం CEOగా వ్యవహరిస్తున్న సందీప్ కటారియాను సంస్థ యాజమాన్యం గ్లోబల్ CEOగా నియమించింది.బాటా లో మరే భారతీయుడు ఇంతటి అత్యున్నత పదవిని పొందలేదు.

2016లో బాటా గ్లోబల్ CEOగా బాధ్యతలు చేపట్టిన అలెక్సిస్ నాసార్డ్ పదవీ విరమణతో ఆయన స్థానంలో సందీప్ కటారియా బాధ్యతలు చేపట్టనున్నారు.

Latest Updates